కూలిపోయిన పాక్ విమాన శకలాల్లో రూ.3 కోట్ల నగదు

ABN , First Publish Date - 2020-05-29T23:01:21+05:30 IST

ఇటీవల కూలిపోయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ విమానం శకలాల్లో దర్యాప్తు అధికారులు 30 కోట్ల పాకిస్తానీ రూపాయల..

కూలిపోయిన పాక్ విమాన శకలాల్లో రూ.3 కోట్ల నగదు

కరాచీ: ఇటీవల కూలిపోయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ విమానం శకలాల్లో దర్యాప్తు అధికారులు 3 కోట్ల పాకిస్తానీ రూపాయల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు మూడు బ్యాగుల్లో వివిధ దేశాలకు చెందిన కరెన్సీల్లో ఈ నగదు ఉన్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ‘‘ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది, బ్యాగేజి స్కానర్లను దాటుకుని ఇంత పెద్దమొత్తంలో విమానంలోకి డబ్బు ఎలా వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నాం...’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మృత దేహాలు, వారి వస్తువుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందనీ.. బాధిత కుటుంబాలకు వాటిని అప్పగిస్తామని ఆయన అన్నారు.  


గత శుక్రవారం 99 మందితో లాహోర్ నుంచి కరాచీ వస్తున్న ఎయిర్‌బస్ ఏ320 విమానం.. కొద్ది నిమిషాల్లో దిగుతుందనగా జిన్నా విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. పాకిస్తాన్ చరిత్రలోనే దీనిని అతిపెద్ద విమాన ప్రమాదంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు సజీవంగా బయటపడగా.. 97 మంది ప్రాణాలు కోల్పోయారు. జనావాసాలపై పడడంతో కింద ఉన్న మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Updated Date - 2020-05-29T23:01:21+05:30 IST