డైరీ ఆవిష్కరణలో మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదికారులు
పాలమూరు, జనవరి 25 : తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ 2022ను మంగళవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ హాలులో పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, రైతుబంధును ప్రజలకు చేరువయ్యేందుకు ముందు వరుసలో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్, దేవరకద్ర, మఖ్తల్, నారాయణపేట, షాద్‌నగర్, పరిగి, కొడంగల్లు, మహబూబ్‌నగర్, నారాయణపేట కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారి వై.సుచరిత, ఆత్మ పీడీ హుఖ్యానాయక్, అసోసియేషన్ జిల్లా చైర్మన్ బొవ్వల వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మురళీధర్, జిల్లా ప్రతినిధి శ్యాంయాదవ్ పాల్గొన్నారు.