మత్తులో యువత

ABN , First Publish Date - 2021-10-18T03:48:20+05:30 IST

నల్లమల ప్రాంతం గంజాయి సాగుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పద ర, అమ్రాబాద్‌ మండలాల్లో దీనిని సాగు చేస్తున్నా రు. పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారుల సమన్వయంతో దాడులు జరుగుతున్నా, కొందరు అధికారుల కళ్లు కప్పి, పలువురు ప్రజాప్రతినిధుల అండదండలతో సాగు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

మత్తులో యువత

పదర, అక్టోబరు 17: నల్లమల ప్రాంతం గంజాయి సాగుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పద ర, అమ్రాబాద్‌ మండలాల్లో దీనిని సాగు చేస్తున్నా రు. పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారుల సమన్వయంతో దాడులు జరుగుతున్నా, కొందరు అధికారుల కళ్లు కప్పి, పలువురు ప్రజాప్రతినిధుల అండదండలతో సాగు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. భూములు చదునుగా ఉన్న అటవీ ప్రాంతంలోని కృష్ణానది తీరం వెంట గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం. ఈ రెండు మండలాల్లోని పలు గ్రామాలు, తండాల్లో కంది, మిర్చి తదితర పంటల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారని తెలుస్తోంది.


నమోదైన కేసులు

2017లో అమ్రాబాద్‌ మండలం లక్ష్మాపూర్‌ తండాలో మిర్చిలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు చేసి, ధ్వంసం చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. 2019 నవంబరు 10న మండలంలోని ఇప్పలపల్లిలో ఓ వ్యక్తి నుంచి 350 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూలై 20న రెండున్నర కేజీల గంజాయిని స్విఫ్ట్‌ కారులో పదర వివేకానంద చౌరస్తాలో పట్టుకున్నారు. పట్టుపడిన ఐదు మంది యువతపై కేసు నమోదు చేసి, రిమాండ్‌ చేశారు. అదేరోజు అమ్రాబాద్‌ మండ లంలోని వెంకటేశ్వరబావి వద్ద బైక్‌పై వెళ్తున్న ము గ్గురు యువకులు దగ్గర కేజీ గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, రి మాండ్‌కు తరలించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు అమ్రాబాద్‌ మండలంలోని లక్ష్మాపూర్‌లో రెండు కిలలో 400 గ్రాముల గంజాయిని ఒక యు వకుని దగ్గర స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 11న పదర మెయిన్‌ రోడ్డు స్వామి వివేకానంద చౌరస్తాలో బైక్‌ మీద 500 గ్రాముల గంజాయితో నలుగురు యువకులు పట్టుబడ్డారు. ఈ నెల 8న పదర మండ లంలోని ముర్సు తండాకు చెందిన దేశావత్‌ కిషన్‌ మిర్చిలో అంతర పంటగా 70 గంజాయి మొక్కలను సాగు చేశాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

Updated Date - 2021-10-18T03:48:20+05:30 IST