ఇంటింటా జాతీయ జెండా అవగాహన ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-12T03:35:38+05:30 IST

కావలి వెంగళరావునగర్‌లోని పొట్టి శ్రీరాములు మున్సిపల్‌ హైస్కూల్‌ నావెల్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో గు

ఇంటింటా జాతీయ జెండా అవగాహన ర్యాలీ
ఇంటింటా జాతీయ జెండా ర్యాలీలో ఉపాధ్యాయులు విద్యార్ధులు

కావలిటౌన్‌, ఆగస్టు 11: కావలి వెంగళరావునగర్‌లోని పొట్టి శ్రీరాములు మున్సిపల్‌ హైస్కూల్‌ నావెల్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటా జాతీయ జెండా అవగాహన ర్యాలీ నిర్వహించారు.  పాఠశాల ఎన్‌సీసీ ఆఫీసర్‌ కొండారెడ్డి పర్యవేక్షణలో జరిగిన ర్యాలీని ప్రధానోపాధ్యాయులు వీ సుబ్బారావు  ప్రారంభించారు. ర్యాలీలో భాగంగా విద్యార్ధులు ఇళ్లిళ్లు తిరిగి జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హయ్యూల్‌ హయ్యూమ్‌, సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ గిరీష్‌, రామ్‌ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 


బ్రాహ్మణక్రాకలో...


జలదంకి : ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మండలంలోని బ్రాహ్మణక్రాకలో గురువారం శ్రీవిద్యానికేతన్‌ స్కూలు విద్యార్థులు తిరంగా ర్యాలీ  నిర్వహించారు. జాతీయ జెండాలు చేతబూనిన వీధుల వెంట ర్యాలీ చేస్తూ వందేమాతరం, భారత్‌మాతాకిజై అంటూ నివాదాలు చేశారు. ర్యాలీలో స్కూల్‌ కరస్పాండెంట్‌ మారెళ్ల బ్రహ్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


అప్పసముద్రంలో...


ఉదయగిరి రూరల్‌ : మండలంలోని అప్పసముద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం జీ.వెంకటేశ్వర్లు, పీఎంసీ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు సుధాకర్‌రెడ్డి, పద్మావతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 


అన్నగారిపాళెంలో..


కావలి :  ఆజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా గురువారం కావలి రూరల్‌ మండలం అన్నగారిపాలెంలో ర్యాలీ నిర్వహించారు. అమృత్‌ సరోవర్‌ చెరువు దగ్గర ఎంపీడీవో సుబ్బారావు ఆధ్వర్యంలో భారత్‌మాతాకి జై అంటూ సిబ్బంది, ప్రజలు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ పథకం టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులరెడ్డి, బాలస్వామి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ఉదయగిరిలో..


ఉదయగిరి : ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని  ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయగరి బిట్‌-1 సచివాలయంలో జరిగిన జగనన్న విద్యాదీవెనలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం వైయస్సార్‌ భీమా స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో  వైసీపీ మండల కన్వీనర్‌ అక్కి భాస్కర్‌రెడ్డి, సొసైటీ అద్యక్షుడు మాలే వినయ్‌రెడ్డి, సర్పంచు కటారీ వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఉదయగిరిలో గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులు భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. గ్రంథాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఉదయగిరి మెయిన్‌ బజారు మీదుగా బస్టాండు వరకు సాగింది. ఈ కార ్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


 సీతారామపురంలో..


సీతారామపురం : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని  సీతారామపురంలో  గురువారం 75 అడుగుల జాతీయ జెండాతో విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌, ఎంఈవో మస్తాన్‌వలి, ఈవోపీఆర్డీ భార్గవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 








Updated Date - 2022-08-12T03:35:38+05:30 IST