రేపు ‘డెక్కన్‌ ఫైన్‌’లో ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2021-03-05T05:43:38+05:30 IST

డెక్కన్‌ ఫైన్‌ ఆగ్రో కెమికల్స్‌ ప్రొడక్షన్‌ విభాగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 6న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని గాయత్రీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ పీవీకే మణికుమార్‌ తెలిపారు.

రేపు ‘డెక్కన్‌ ఫైన్‌’లో  ఇంటర్వ్యూలు

పార్వతీపురం టౌన్‌: డెక్కన్‌ ఫైన్‌ ఆగ్రో కెమికల్స్‌ ప్రొడక్షన్‌ విభాగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 6న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని గాయత్రీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ పీవీకే మణికుమార్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపు రం గాయత్రి డిగ్రీ కళాశాలలో ఔట్‌సోర్సింగ్‌ సంస్థల ద్వారా డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంపికైన వారికి తుని సమీపంలోని పాయకరావుపేట డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌లో ఉద్యోగం కల్పిస్తామన్నారు. 27 సంవత్సరాల వయస్సు మించరాదని, బీఎస్సీ డిగ్రీలో పాసై కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలని తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువ పత్రాల కాపీలు, పాస్‌ ఫొటోలు, ఏదైనా ఐడీ ప్రూఫ్‌ తీసుకు రావాలని సూచించారు. 

 

Updated Date - 2021-03-05T05:43:38+05:30 IST