యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-22T05:09:37+05:30 IST

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి అన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
10వ బెటాలియన్‌లో యోగా చేస్తున్న కమాండెంట్‌, సిబ్బంది

- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి

- ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

- జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల నిర్వహణ

గద్వాల టౌన్‌/ మల్దకల్‌/ రాజోలి/ కేటీదొడ్డి/ గట్టు/ అయిజ టౌన్‌, జూన్‌ 21 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి అన్నారు. ప్రతీ ఒక్కరు యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచిం చారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించు కుని పట్టణంలోని ఇండోర్‌ స్టేడియంలో సోమవారం నిర్వ హించిన యోగా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యోగా సాధనతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం కలుగుతుం దన్నారు. కార్యక్రమంలో యోగా గురువు మరడి శ్రీకాంత్‌, తాలూకా ఇన్‌చార్జి రవి ఎక్బోటే, బండల వెంకట రాములు, రామాంజనేయులు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు టీ కృష్ణవేణి, కౌన్సిలర్‌ త్యాగ రాజు, నాయకులు డీటీడీసీ నరసింహ, భాస్కర యాదవ్‌, తిమ్మల నరసింహలు, శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రవీణ్‌, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 


- పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పతం జలి యోగా సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో అధ్యాపకు లు, విద్యార్థులు యోగా చేశారు. కార్యక్రమంలో కళాశాల సూపరింటెండెంట్‌ ఆంజనేయులు, అధ్యాప కులు పాల్గొన్నారు. 


- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్భంగా మల్దకల్‌ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్‌ మోర్చా జిల్లా నాయ కుడు పాలవాయి రాములు హాజరయ్యారు. కార్యక్రమంలో మల్దకల్‌ మండల శాఖ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి , దామ నాగరాజు, గోవిందు, నర్సింహులునాయక్‌, లక్ష్మన్న, రాముడు, కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మీనారాయణ, కిశోర్‌, బుడ్డన్న, ఖాజా, సవారన్నగౌడు, వెంకటన్న, జయరాములు, బీసన్న పాల్గొన్నారు.


- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజోలిలో పలు యువజన సంఘాల సభ్యులు యోగా సనాలు వేశారు. కార్యక్రమంలో రాజోలి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్‌ రెడ్డి, జైశ్రీరామ్‌ సేవా సమితి అధ్యక్షుడు శశికుమార్‌, సభ్యులు నాగరాజు, గోవిందు, అంజి పాల్గొన్నారు.


- ప్రతీ రోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని బీజేపీ కేటీదొడ్డి మండల అధ్యక్షుడు మహానందిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మహా దేవ్‌, పద్మారెడ్డి, పాపిరెడ్డి పాల్గొన్నారు.  


- గట్టు మండలం మాచర్లలోని గ్రామ పంచాయతీ అవరణలో ఉపాధిహమీ కూలీలతో యోగాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవ, సర్పంచ్‌ సిద్ధిరామప్ప పాల్గొన్నారు. రెయిన్‌బో పాఠశాలలో విద్యార్థులతో యోగాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సీహెచ్‌ రాజు, వి.వీరేష్‌, జే ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని అయిజ పట్టణంలోని మద్దిలేటిస్వామి ఆల యం దగ్గర యోగా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్‌ దేవన్న, సింగిల్‌ విండో అధ్యక్షుడు మధుసూధన్‌ రెడ్డి, కౌన్సిలర్‌ శేక్షావలి ఆచారి, సత్యం, రంగు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

- ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలోని 10వ పోలీస్‌ బెటాలియన్‌లో అంతర్జాతీయ యోగాదినోత్స వం ఘనంగా నిర్వహించారు. పరేడ్‌ మైదానంలో కమాండెంట్‌ సయ్యద్‌ జమీల్‌ బాషా ఆధ్వర్యంలో సిబ్బంది  యోగా చేశారు. 



Updated Date - 2021-06-22T05:09:37+05:30 IST