సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణ యత్నాల్లో... అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌ ‘ఎస్‌వీఆర్...

ABN , First Publish Date - 2022-01-19T22:51:33+05:30 IST

అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌గా నియమితుడై, బాధ్యతలు స్వీకరించిన తెలుగోడు... ఎస్‌వీఆర్(సరికొండ వినయ్‌ రెడ్డి) తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా తన సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.

సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణ యత్నాల్లో... అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌ ‘ఎస్‌వీఆర్...

హైదరాబాద్ : అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌గా నియమితుడై, బాధ్యతలు స్వీకరించిన తెలుగోడు... ఎస్‌వీఆర్(సరికొండ వినయ్‌ రెడ్డి) తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా తన సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే... త్వరలో దుబాయ్‌లో పర్యటించనున్న ఎస్‌వీఆర్... ఆయా సేవా కార్యక్రమాలకు తోడ్పాటునందించాల్సిందిగా తెలుగు ప్రముఖులను అభ్యర్ధించనున్నారు. కాగా... తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవానికి(అంతర్జాతీయ పీస్ అంబాసడర్) ఎంపికైన మొట్టమొదటి ప్రముఖుడు ఎస్‌వీఆర్ కావడం విశేషం.


ఫ్లోరిడా(అమెరికా)లోని వరల్డ్ హ్యుమానిటీ కమిషన్(భారత్) ఈ గౌరవాన్ని ప్రకటించిన విషఫయం తెలిసిందే. దుబాయ్‌లో జరగనున్న ఓ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఇదే క్రమంలో... ఆ తర్వాత... ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, అమెరికా దేశాల్లో కూడా ఎస్‌వీఆర్ పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే భారత్‌లో చేపడుతోన్న సేవా కార్యక్రమాలకు సంబంధించి ఎస్‌వీఆర్... ఎటువంటి విరాళాలనూ స్వీకరించకుండా, సొంత ఖర్చుతోనే నిర్వహిస్తూండడం గమనార్హం. మరోవైపు... తమతో కలిసిపనిచేయాల్సిందిగా ఎస్‌వీఆర్‌ను పలు అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానిస్తుండడం విశేషం. 


కాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతగా జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే క్రియాశీల బాధ్యతలను నిర్వర్విస్తోన్న ఎస్‌వీఆర్‌ను... ఇదే క్రమంలో... జాతీయస్థాయిలోని ఓ ప్రముఖ సంస్థ కు సారధ్య బాధ్యతలను అప్పగించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు వినవస్తోంది. ఇక... దుబాయ్ పర్యటన అనంతరం... తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో తన సామాజిక కార్యక్రమాలను మరింత పెద్దఎత్తున చేపట్టేందుకు ఎస్‌వీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నారు. 

Updated Date - 2022-01-19T22:51:33+05:30 IST