సామాన్యులకు ‘సేవ’లో తోడ్పాటునందించండి... అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌ ఎస్‌వీఆర్...

ABN , First Publish Date - 2022-02-02T01:31:14+05:30 IST

తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక అలమటిస్తోన్న పేదలకు అండగా నిలవాలని అంతర్జాతీయ పీస్ అంబాసడర్, శుభ్ గ్రూపు ఏసియా పసిఫిక్ ఛైర్మన్, తెలంగాణకు చెందిన నాయకుడు ఎస్‌వీఆర్(సరికొండ వినయ్‌కుమార్ రెడ్డి) పిలుపునిచ్చారు.

సామాన్యులకు ‘సేవ’లో తోడ్పాటునందించండి... అంతర్జాతీయ పీస్ అంబాసడర్‌ ఎస్‌వీఆర్...

హైదరాబాద్/దుబాయ్ : తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక అలమటిస్తోన్న పేదలకు అండగా నిలవాలని అంతర్జాతీయ పీస్ అంబాసడర్, శుభ్ గ్రూపు ఏసియా పసిఫిక్ ఛైర్మన్, తెలంగాణకు చెందిన నాయకుడు ఎస్‌వీఆర్(సరికొండ వినయ్‌కుమార్ రెడ్డి) పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే... తాము నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలకు తోడ్పాటునందించాలని కోరారు. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా తన సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే... త్వరలో దుబాయ్‌లో పర్యటించనున్న ఎస్‌వీఆర్... ఆయా సేవా కార్యక్రమాలకు తోడ్పాటునందించాల్సిందిగా తెలుగు ప్రముఖులను అభ్యర్ధించనున్నారు. కాగా... తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవానికి(అంతర్జాతీయ పీస్ అంబాసడర్) ఎంపికైన మొట్టమొదటి ప్రముఖుడు ఎస్‌వీఆర్ కావడం విశేషం. ఇదే క్రమంలో... ఆ తర్వాత... ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, అమెరికా దేశాల్లో కూడా ఎస్‌వీఆర్ పర్యటించనున్నారు.


మరోవైపు... తమతో కలిసిపనిచేయాల్సిందిగా ఎస్‌వీఆర్‌ను పలు అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానిస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా... జాతీయస్థాయిలోని ఓ ప్రముఖ సంస్థ కు సారధ్య బాధ్యతలను ఎస్‌వీఆర్‌కు  అప్పగించాలని కేంద్రం భావిస్తున్నట్లు వినవస్తోంది. ఇక... దుబాయ్ పర్యటన అనంతరం... తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో తన సామాజిక కార్యక్రమాలను మరింత పెద్దఎత్తున చేపట్టేందుకు ఎస్‌వీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నారు. బిట్‌కాయిన్ తరహాలో అంతర్జాతీయంగా ఇటీవీల అనూహ్యమైన ప్రాచుర్యంలోకొచ్చిన ‘శుభ్ కాయిన్’ గ్రూపు దుబాయ్ లోని సీఐఈఎల్ దుబాయ్ మరీనా హోటల్‌లో నిర్వహిస్తోన్న సదస్సులో ఆయన ప్రసంగించారు. శుభ్ కాయిన్ తో ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేసే వీలుందని ఎస్‌వీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా... దుబాయ్ లో శుభ్ గ్రూపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది. కాగా శుభ్ గ్రపు.. ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానాల్లో ఉన్న పన్నెండు సంస్థలతో కలిసి పనిచేస్తోంది. కాగా లక్షల సంఖ్యలో చిన్నారులకు విద్యనందించే దిశగా కూడా సిద్ధమవుతున్నట్లు శుభ్ గ్రూపు ఏసియాపసిఫిక్ ఛైర్మన్ నీల్ సావంత్, ఎస్‌వీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. శుభ్ గ్రూపు ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈఓ) నీల్ సావంత్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. కాగా భారత్ లో నిర్వహిస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాల నేపధ్యంలో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు నీల్ సావంత్, ఎస్‌వీఆర్‌లను అభినందించారు. దుబాయ్, యూఎస్ ప్రభుత్వాలు ఈ సందర్భంగా ఆయనను సన్మానించాయి. మరోవైపు పేదలకు ఉపాధి కల్పన దిశగా ఎస్‌వీఆర్ చేస్తోన్న మెడికల్ కిట్లు, ఆహారం, ఆరోగ్య సేవల అందజేత తదితర  కార్యక్రమాలకుగాను భారత ప్రభుత్వం నుంచి కూడా అభినందనలందాయి. ఇక... భారత్‌లో శుభ్ గ్రూపు ఓ విప్లవాన్ని సృష్టిస్తుందని నీల్ సావత్, ఎస్‌వీఆర్ పేర్కొన్నారు.  

Updated Date - 2022-02-02T01:31:14+05:30 IST