Tirupati IIDTలో ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-06-29T21:29:00+05:30 IST

తిరుపతిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌(ఐఐడీటీ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లు, ట్రెయినింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌, ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లు అందిస్తోంది.

Tirupati IIDTలో ప్రోగ్రామ్‌లు

తిరుపతిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌(ఐఐడీటీ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లు, ట్రెయినింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌, ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. 

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లు

పీజీ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ, పీజీ ఇన్‌ డేటా సైన్స్‌, పీజీ ఇన్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, పీజీ ఇన్‌ ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి 11 నెలలు. ఇవి రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌లు. రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65 శాతం మార్కులతో ఎమ్మెస్సీ(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌)/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో కూడా ప్రథమ శ్రేణి మార్కులు ఉండాలి. డేటా సైన్స్‌ ప్రోగ్రామ్‌నకు  ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, అకౌంటెన్సీ, మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, బయోటెక్నా లజీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలలో ఒకటి ప్రధాన సబ్జెక్ట్‌గా డిగ్రీతోపాటు ఎంబీఏ/ ఎంసీఏ/ ఎంకాం/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు; కనీసం 70 శాతం మార్కులతో బీబీఏ/ బీసీఏ/బీఎస్సీ/ బీకాం/ బీఏఎఫ్‌ పూర్తిచేసిన వారు  కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. గేట్‌/ జీమ్యాట్‌/ క్యాట్‌/ జీఆర్‌ఈ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్న అభ్యర్థులకు రాత పరీక్ష నుంచి మినహాయింపునిస్తారు. ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానం, కోడింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

రిటెన్‌ ఎగ్జామినేషన్‌: దీనిని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40 ప్రశ్నలు, టెక్నికల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. తప్పుగా గుర్తించిన సమాధానానికి మూడోవంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.  

ట్రెయినింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌

ప్రోగ్రామ్‌ పేరు ఓపెన్‌ హైబ్రిడ్‌ క్లౌడ్‌ ఆన్‌ లీనక్స్‌. ఇది నాలుగు నెలల వ్యవధి గల రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. దీనికి రెడ్‌ హ్యాట్‌ టెక్నాలజీస్‌ సహకారం అందిస్తోంది. 

ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లు

  • రెండు నెలల వ్యవధి గల ‘ఇంట్రడక్షన్‌ టు సైబర్‌ సెక్యూరిటీ’
  • మూడు నెలల వ్యవధి గల ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌
  • వీటికి ఆసక్తిగలవారందరూ అప్లయ్‌ చేసుకోవచ్చు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1000. 

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూలై 24. 

చిరునామా: ఐఐడీటీ, న్యూ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌, రేణిగుంట, తిరుపతి. 

వెబ్‌సైట్‌: www.iidt.edu.in

Updated Date - 2022-06-29T21:29:00+05:30 IST