జూన్ రెండోవారం నుంచి అంతర్జాతీయ విమానాలు: కేంద్రం

ABN , First Publish Date - 2020-05-23T22:24:22+05:30 IST

కరోనా వైరస్ ఉద్ధృతి కనుక తగ్గినట్టు అయితే జూన్ మధ్య నుంచి కానీ, జులై చివరి నుంచి కానీ అంతర్జాతీయ

జూన్ రెండోవారం నుంచి అంతర్జాతీయ విమానాలు: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉద్ధృతి కనుక తగ్గినట్టు అయితే జూన్ మధ్య నుంచి కానీ, జులై చివరి నుంచి కానీ అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తామని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఆగస్టు వరకో, సెప్టెంబరు వరకో ఎందుకు ఆగాలని మంత్రి ప్రశ్నించారు. పరిస్థితి నెమ్మదించినా, లేదంటే అది మనం ఊహించిన రీతిలో ఉన్నా మనం దానితో కలిసి సర్దుకుపోతామని అన్నారు. కాబట్టి జూన్ మధ్య నుంచో, జులై ఆఖరులోనే విమాన సేవలు తిరిగి ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నించారు. అలాగే కేరళ, కర్ణాటక, అసోం సహా ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే దేశీయ విమాన ప్రయాణికులను వారం రోజులపాటు సంస్థాగత క్వారంటైన్ చేయాలన్న డిమాండ్‌ను కూడా ఆయన కొట్టిపడేశారు. ఆరోగ్యసేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ ఉన్నప్పుడు వారిని క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఏముందని మంత్రి ప్రశ్నించారు.

Updated Date - 2020-05-23T22:24:22+05:30 IST