వీఎన్‌ఆర్‌ వీజేఐఈటీలో అంతర్జాతీయ సదస్సు

ABN , First Publish Date - 2020-11-01T08:52:02+05:30 IST

బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పేరిట ఏఐసీటీఈ ప్రాయోజిత అంతర్జాతీయ సదస్సు శనివారం జరిగింది

వీఎన్‌ఆర్‌ వీజేఐఈటీలో అంతర్జాతీయ సదస్సు

నిజాంపేట, అక్టోబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పేరిట ఏఐసీటీఈ ప్రాయోజిత అంతర్జాతీయ సదస్సు శనివారం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా పుణెలోని హైఎనర్జీ మెటేరియల్స్‌ రిసెర్చ్‌ ల్యాబరేటరీ శాస్త్రవేత్త సంచాలకుడు డాక్టర్‌ కేపీఎస్‌ మూర్తి హాజరయ్యారు. గౌరవ అతిథిగా సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడు డాక్టర్‌ మనోజ్‌గుప్తా హాజరయ్యారు. మరో గౌరవ అతిథి ఏఐసీటీ ఈ సంచాలకుడు కల్పల్‌ వెంకట్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎనర్జి టెక్నాలజీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ నేతాజీ రవికిరణ్‌ కేసన, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్‌ ఎల్‌ శివరామకిృష్ణ, ఐఐటి తిరుపతి ఆచార్యులు ఎం రవిశంకర్‌, కీలకోపన్యాసాలు చేశారు. ఈ సదస్సుకు వివిధ రాష్టాలేకాక 150 మందికిపైగా పరిశోధన పత్రాలు రాగా వాటిలో 80కి పైగా అందర్జాల వేదికగా పత్రాలను సమర్పించనున్నారని నిర్వాహక కార్యదర్శులు   మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగ ఆచార్యులు శివరాజ్‌ నారాయన్‌ తెలిపారు. సదస్సులో కళాశాల ప్రధానాచార్యులు సిడి నాయుడు, సంచాలకులు బి.చెన్నకేశవరివు, ఎ.శుభానందం, శ్రీనివాస్‌ గుప్తా తదిదరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-01T08:52:02+05:30 IST