Abn logo
Aug 2 2021 @ 08:59AM

ఫొటోగ్రాఫర్‌ నాగరాజుకు International Award

బాపట్ల: బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ పీవీఎస్‌ నాగరాజుకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. నాగరాజు చేసిన ఛాయా చిత్రాలకు ఢిల్లీలోని ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రఫి కౌన్సిల్‌వారు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని గిరిజ నుల జీవనశైలీపై  10 సంవత్సరాలుగా అనేక ప్రదేశాలు తిరిగి చిత్రీకరించిన ఛాయచిత్రాలకు అరుదైన ఈ పురస్కారం లభించింది. నాలుగు దశాబ్దాలుగా ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఫొటోగ్రఫి రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ కౌన్సిల్‌వారు పురస్కారాలతో సత్కరించటం జరుగుతుంది. ఈ ఏడాదికి వెబ్‌సైట్‌ ద్వారా గ్రహీత పేర్లను సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ ఓపి శర్మ ప్రకటించారు. అందులో భాగంగా నాగరాజు తీసిన చిత్రాలకు అంతర్జాతీయ పురస్కారం ప్రకటించారు. ఆగస్టు 19వ తేదిన వరల్డ్‌ ఫొటోగ్రఫి సందర్భంగా ఢిల్లీలోని త్రివేణి కళాసంగమంలో జరిగే ప్రధానోత్సవంలో నాగరాజు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫి అకాడమి జనరల్‌ సెక్రటరి టి.శ్రీనివాసరెడ్డి, చీరాల కెమెర క్లబ్‌ సెక్రటరి ఎస్‌.సురేష్‌, బాపట్ల ప్రగతి ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ వారు అభినందనలు తెలిపారు.