ఇంటర్నల్‌ మార్కుల నమోదుపై నేటి నుంచి తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-22T07:19:03+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ మార్కులు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు మార్కులు కేటాయించనున్నారు. అయితే విద్యార్థులకు ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ పరీక్షలు పక్కాగా నిర్వహించారా, లేదా, అనే అంశాలను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది.

ఇంటర్నల్‌ మార్కుల నమోదుపై  నేటి నుంచి తనిఖీలు

జిల్లాలో 69 కమిటీల ఏర్పాటు

డీఈఓ పర్యవేక్షణలో రెండు రోజుల గడువు 

ఒక్కో టీములో ముగ్గురు సభ్యులు 


నల్లగొండ క్రైం, ఏప్రిల్‌ 21: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ మార్కులు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు మార్కులు కేటాయించనున్నారు. అయితే విద్యార్థులకు ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ పరీక్షలు పక్కాగా నిర్వహించారా, లేదా, అనే అంశాలను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 544 ఉన్నత పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 21,173 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇప్పటికే ఫార్మెటివ్‌ అసె్‌సమెంట్‌-1 పరీక్షలు పూర్తి కాగా, ఆ మార్కులే ప్రస్తుతం విద్యార్థులకు కీలకంగా మారనున్నాయి. ఆయా పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో నమోదుచేసిన ఇంటర్నల్‌ మార్కుల తనిఖీ కోసం విద్యాశాఖ తనిఖీ కమిటీలను నియమించింది. 


జిల్లాలో 69 కమిటీలు

జిల్లావ్యాప్తంగా ఇంటర్నల్‌ మార్కుల నమోదును పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి పర్యవేక్షణలో 69 కమిటీలను నియమించారు. ఈకమిటీలో ముగ్గురు సభ్యులుండగా, అందులో హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌ హోదా కలిగిన వారు ఉన్నారు. అయితే ఈ కమిటీలు ఈనెల 22, 23 తేదీల్లో పలు అంశాలను పరిశీలించి వివిధ రకాలుగా తనిఖీలు చేయనున్నాయి. అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నిర్వహించిన ఎఫ్‌ఏ 1, ప్రా జెక్టులు, ఇతర రికార్డులను పర్యవేక్షిస్తారు. ప్రతి ఎఫ్‌ఓ పరీక్షకు ఇతర అంశాలకు సంబంధించి 20 మార్కులను కేటాయిస్తారు. ప్రాజెక్టులకు ప్రత్యేక మార్కులు ఉంటాయి. 


నేడు, రేపు ఇంటర్నల్‌ మార్కుల నమోదుపై తనిఖీలు : బొల్లారం భిక్షపతి, డీఈఓ, నల్లగొండ 

కరోనా నేపథ్యంలో పది పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులకు మార్కుల కేటాయింపు కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభించాం. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇంటర్నల్‌ మార్కుల నమోదుతోపాటు వివిధ అంశాలను పాఠశాలలవారీగా తనిఖీ చేసేందుకు 69 కమిటీలను ఏర్పాటుచేశాం. ముగ్గురు సభ్యులుండే, ఈ కమిటీలు పాఠశాలల్లో వివిధ అంశాలను తనిఖీ చేసి వివిధ రికార్డులను పరిశీలించనున్నారు. విద్యార్థులు నైపుణ్యాల మేరకు మార్కులు నమోదు ఉంటేనే కమిటీలు అంగీకరిస్తాయి లేకుంటే, వారికి ఏ స్థాయిలో మార్కులు ఉండాలో సూచించి నివేదికలను జిల్లా విద్యాశాఖకు అందజేస్తారు. 


Updated Date - 2021-04-22T07:19:03+05:30 IST