పొరుగు దేశానికి పాకిస్తాన్ అనే పేరు ఎలా వచ్చింది? అది ప్రత్యేక దేశంగా ఎలా ఏర్పడిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-12T13:24:10+05:30 IST

1947 ఆగస్టు 15.. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం..

పొరుగు దేశానికి పాకిస్తాన్ అనే పేరు ఎలా వచ్చింది? అది ప్రత్యేక దేశంగా ఎలా ఏర్పడిందో తెలిస్తే..

1947 ఆగస్టు 15.. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం.. అయితే ఇదేరోజు కొందరికి విభజన విషాదాన్ని గుర్తు చేస్తుంది. బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపెట్టారు. దేశం రెండు భాగాలుగా విభజించబడింది. స్వాతంత్ర్యం తరువాత కొన్ని వేల కుటుంబాల్లోని కుటుంబ సభ్యులు సరిహద్దుకు అటువైపు.. ఇటువైపుగా విడిపోవాల్సివచ్చింది. దేశం హిందూస్థాన్, పాకిస్తాన్ అని రెండు భాగాలుగా విడిపోయింది. హిందుస్థాన్ అనే పేరు ఎలావచ్చిందనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే పొరుగుదేశానికి పాకిస్తాన్ అని ఎలా పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? వివరాల్లోకి వెళ్లి.. పాకిస్థాన్‌కు పేరు పెట్టిన నాటి చరిత్రను పరిశీలిస్తే.. 


1920లో ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా భారత జాతీయ కాంగ్రెస్‌(ఐఎన్‌సి)కు రాజీనామా చేసి  పార్టీ నుంచి విడిపోయినప్పుడు పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహమ్మద్ అలీ జిన్నాకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన డిమాండ్‌గా మారింది. 1930లలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ప్రత్యేక ముస్లిం దేశం కోసం డిమాండ్ బయటకు వచ్చింది. అప్పటి వరకు ఆ దేశానికి ఒక పేరంటూ ఏమీ అనుకోలేదు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం, 1933లో ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్న ముస్లిం జాతీయవాద విద్యార్థి చౌదరి రహమత్ అలీ తన స్నేహితులతో కలిసి ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌ను లేవదీశాడు. ఇదే సమయంలో తన స్నేహితులతో కలిసి, ప్రత్యేక ముస్లిం దేశం ఏర్పాటు.. అందులో ఏయే రాష్ట్రాలను చేర్చాలి? దేశానికి ఏ పేరు పెట్టాలనే దానిపై బ్లూప్రింట్‌ను సిద్ధం చేశాడు. బ్రిటీషర్లు, భారత నేతల మధ్య జరిగిన మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో రహమత్ అలీ ఈ ప్రతిపాదన వారి ముందుకు తెచ్చారు. అతను 'నౌ ఆర్ నెవర్' పేరుతో ఒక బుక్‌లెట్‌ను సిద్ధం చేశాడు. అందులో తొలిసారిగా పాకిస్తాన్ పేరు ప్రస్తావించాడు. భారతదేశంలోని దాదాపు మూడు కోట్ల మంది ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాక్‌స్థాన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. ఈ విధంగా 1933 జనవరి 28న పాకిస్తాన్ అనే పదం ప్రపంచం ముందుకు వచ్చింది. ముస్లిం లీగ్ నాయకులు, మహమ్మద్ అలీ జిన్నా, అల్లామా ఇక్బాల్ కొత్త ముస్లిం దేశానికి పాకిస్తాన్ పేరును నిర్ణయించారు. లాహోర్ సమావేశంలో వారు ప్రత్యేక ముస్లిం రాజ్యాంగాన్ని ప్రతిపాదించారు. నిజానికి పాక్ అంటే స్వచ్ఛమని, స్తాన్ అంటే భూమి అని అర్థం.

Updated Date - 2022-02-12T13:24:10+05:30 IST