యుద్ధం కారణంగా చర్చల్లో ఉన్న ఉక్రెయిన్.. ఈ అంశాల పరంగానూ పేరొందిందని మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-02-22T13:48:13+05:30 IST

ఉక్రెయిన్- రష్యా మధ్య వివాదం...

యుద్ధం కారణంగా చర్చల్లో ఉన్న ఉక్రెయిన్.. ఈ అంశాల పరంగానూ పేరొందిందని మీకు తెలుసా?

ఉక్రెయిన్- రష్యా మధ్య వివాదం  చాలా కాలంగా కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్ గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ను మూడు వైపుల నుండి చుట్టుముట్టిన రష్యా సైన్యం ఇప్పుడు దాడికి సిద్ధమైందని, ఉపగ్రహం ఆధారంగా ఉక్రెయిన్‌లోని కదలికలను గమనిస్తున్నదని అంటున్నారు. అయితే ఈ వివాదానికి ముందు కూడా ఉక్రెయిన్ పలు అంశాల కారణంగానూ ప్రసిద్ది చెందింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. 

రెండవ అతిపెద్ద దేశం

ఉక్రెయిన్ 1990లో సోవియట్ యూనియన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందింది. ఇది రష్యా తర్వాత ఐరోపాలో అతిపెద్ద దేశం. దాదాపు 30 శాతం జనాభా ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయ పరంగా ఉక్రెయిన్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ క్రైస్తవుల జనాభా అత్యధికం. వారిదే ఇక్కడ మెజారిటీ. దీని తరువాత ముస్లిం జనాభా వస్తుంది. ఉక్రెయిన్ విమానాల తయారీలో కూడా ప్రసిద్ధి చెందింది.


చదువులో అగ్రగామి

99.8 శాతం ఉక్రేనియన్లు సంపూర్ణ అక్షరాశ్యులు. విద్య పరంగా ఉక్రెయిన్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.

మెక్‌డొనాల్డ్స్

ఇక్కడి మెక్‌డొనాల్డ్స్ (రెస్టారెంట్) ఎంతో ప్రత్యేకమైనవి. ప్రపంచంలోనే మూడవ అత్యంత రద్దీగా ఉండే మెక్‌డొనాల్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి మెక్‌డొనాల్డ్స్‌కు లెక్కకు మించి ప్రజలు వస్తుంటారు. టాప్-5 మెక్‌డొనాల్డ్స్‌ ఉన్నదేశంగా ఉక్రెయిన్ పేరు సంపాదించింది. 

అందమైన అమ్మాయిలు

ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలు ఉన్న దేశంగా ఉక్రెయిన్‌ను పరిగణిస్తారు. ఉక్రేనియన్ మహిళలు పురుషులతో కలిసి సమానంగా పని చేస్తారు. పనిలో మహిళల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తుంది. ఇంటి పనలు మొదలుకొని పార్లమెంటు  కార్యకలాపాల వరకూ మహిళల భాగస్వామ్యం కనిపిస్తుంది. 

Updated Date - 2022-02-22T13:48:13+05:30 IST