మారటోరియంలో ఈఎంఐలపై వడ్డీ..సుప్రీంలో పిటీషన్... ఆర్‌బీఐ, కేంద్రానికి నోటీసులు

ABN , First Publish Date - 2020-05-26T23:36:13+05:30 IST

కరోనా లాక్‌డౌన్ సమయంలో రుణాల చెల్లింపులకు సంబంధించి సామాన్య , మధ్యతరగతి ప్రజలకు ఆర్‌బీఐ మూడు నెలల పాటు తాత్కాలిక నిషేధం విధిస్తూ మారటోరియం​ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మారటోరియం సమయంలో పేరుకుపోయిన రుణ వాయిదాలపై కూడా బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది . దీనిపై మంగళవారం వాదనలు జరిగాయి. ఈ నేపధ్యంలో... కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

మారటోరియంలో ఈఎంఐలపై వడ్డీ..సుప్రీంలో పిటీషన్... ఆర్‌బీఐ, కేంద్రానికి నోటీసులు

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ సమయంలో రుణాల చెల్లింపులకు సంబంధించి సామాన్య , మధ్యతరగతి ప్రజలకు ఆర్‌బీఐ మూడు నెలల పాటు తాత్కాలిక నిషేధం విధిస్తూ మారటోరియం​ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మారటోరియం సమయంలో పేరుకుపోయిన రుణ వాయిదాలపై కూడా బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్  దాఖలైంది . దీనిపై మంగళవారం వాదనలు జరిగాయి. ఈ నేపధ్యంలో...  కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.


లాక్‌డౌన్‌తో దేశం మొత్తంగా ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఇక ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈఎంఐల చెల్లింపుపై మూడు నెలల పాటు  మారటోరియంను విధించింది. ఇక కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇంకా జనజీవనం సాధారణ స్థితికి రాకపోవటంతో మరోమారు ఆగస్ట్‌ 31 వరకూ ఆర్‌బీఐ మారటోరియం ను పొడిగించింది. అయితే ఆ తరువాత మారటోరియం సమయంలో చెల్లించని వాయిదాలపై కూడా వడ్డీ వేస్తున్నారని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 


చెల్లించని వాయిదాలపై చక్రవడ్డీతో​ వెన్ను విరుస్తున్నారని పిటిషనర్ వాదించారు. ఆర్‌బీఐ ముందు రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించి, మరో మూడు నెలల పాటు పొడిగించిందని పిటిషనర్‌ తరపు వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది పేర్కొన్నారు. కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు ఉపశమనం​ అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో​ వెన్ను విరుస్తున్నారని, ఇక అలా చెయ్యకుండా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.


లాక్‌డౌన్‌తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో కూడా రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో మారటోరియం సమయంలో చెల్లించని రుణ వాయిదాలపై వడ్డీ భారం సామాన్యులకు పెను భారం అని ఆయన అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐని ఆదేశిస్తూ ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.

Updated Date - 2020-05-26T23:36:13+05:30 IST