కుప్పం క్వారీలలో మైనింగ్‌ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-25T06:06:16+05:30 IST

కుప్పం, శాంతిపురం మండలాల పరిధిలోని పలు క్వారీలలో సోమవారం భూగర్భ గనుల శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు

కుప్పం క్వారీలలో మైనింగ్‌ అధికారుల తనిఖీలు
గ్రానైట్‌ దిమ్మెలతో సహా సీజ్‌ చేసి తరలించిన లారీలు

పొక్లయినర్లు, కంప్రెషర్లు, గ్రానైట్‌ దిమ్మెల సీజ్‌


కుప్పం, జనవరి 24: కుప్పం, శాంతిపురం మండలాల పరిధిలోని పలు క్వారీలలో సోమవారం భూగర్భ గనుల శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా సాగుతున్న తవ్వకాలను నిలువరించారు. ఈ సందర్భంగా ఆరు పొక్లయినర్లు, 12 కంప్రెషర్లు, లారీలు సీజ్‌ చేసి స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.70 లక్షలు విలువ కలిగిన 200 గ్రానైట్‌ దిమ్మెలు కూడా సీజ్‌ చేశారు. సీజ్‌చేసిన వాహనాలను కుప్పం ఆర్టీసీ బస్టాండు ఆవరణలోకి తరలించారు. పలమనేరు మైనింగ్‌ ఏడీ వేణుగోపాల్‌తోపాటు పలువురు సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ తరచూ తనఖీలు జరుగుతాయని, అక్రమంగా మైనింగ్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.



Updated Date - 2022-01-25T06:06:16+05:30 IST