Abn logo
Mar 29 2020 @ 05:54AM

తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీ

సూళ్లూరుపేట, మార్చి 28: సూళ్లూరుపేటలో శనివారం తూనికలు, కొలతల శాఖ, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు పలు దుకాణాలను తనిఖీ చేశారు. బజారువీధిలో తక్కువ తూకాలతో విక్రయిస్తున్నట్లు గుర్తించి నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. 25 కిలోల బియ్యం బస్తా 24 కిలోలే ఉండటం చూసి వ్యాపారిని మందలించారు. అరలీటరు పాల ప్యాకెట్‌ 34 రూపాయలకు విక్రయిస్తుండటంతో కేసు నమోదు చేశారు.


అనంతరం జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను సందర్శించి ధరలపై ఆరా తీశారు. అధిక ధరలకు కూరగాయాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తుంటే 9963513242 నెంబరుకు తెలియజేయాలని తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ జీ.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ తనిఖీలలో సివిల్‌ సప్లయీస్‌ అధికారిణి సంధ్య, మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement