వ్యాక్సినేషన్‌ కేంద్రాల తనిఖీ

ABN , First Publish Date - 2021-06-21T05:16:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం అన్ని చోట్ల వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని లేబాక గ్రామ సచివాలయంలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని కడప జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ శాఖ సంయుక్త సంచాలకుడు మొగలిచెండు సురే్‌షతో కలిసి తనిఖీ చేశారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రాల తనిఖీ
పెండ్లిమర్రిలో వ్యాక్సినేషన్‌ పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో, ఏపీడీలు

నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌ను వైద్య సిబ్బంది నిర్వహించారు. 45 ఏళ్లు దాటిన వారు, 5 ఏళ్ల పిల్లల తల్లులు వ్యాక్సిన్‌ కేంద్రా లకు వెళ్లి టీకా వేయించుకున్నారు. కాగా, పలు కేంద్రాల్లో జడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ శాఖ సంయుక్త సంచాలకుడు మొగలిచెండు సురేష్‌లు పాల్గొని తనిఖీ చేశారు. 


వల్లూరు, జూన్‌ 20: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం అన్ని చోట్ల వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని లేబాక గ్రామ సచివాలయంలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని కడప జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ శాఖ సంయుక్త సంచాలకుడు మొగలిచెండు సురే్‌షతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో కొవిషీల్డ్‌ టీకా కార్యక్రమానికి సంబంధించి నమోదు వివరాలను అడిగి తెలుసుకుని రికార్డుల్లో రాస్తున్నారా లేదా అని పరిశీలించారు. గ్రామ సచివాలయ సిబ్బందితో, వలంటీర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకిస్తున్న సంక్షేమ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ఉండేట్లు చూడాలని సూచించారు. అనంతరం టీకా కోసం వచ్చిన వారితో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు డాక్టర్‌ ఉమా మహేశ్వరకుమార్‌, డాక్టర్‌ భాస్కర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ ప్రసన్నలక్ష్మి, హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, స్థానిక కార్యదర్శి రియాజ్‌బాషా పాల్గొన్నారు. 


టీకా కేంద్రాల తనిఖీ

పెండ్లిమర్రి, జూన్‌ 20: మండల పరిధిలోని రంపతాడు, పెండ్లిమర్రి గ్రామ సచివాలయాల్లోని టీకా కేంద్రాలను ఆదివారం జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల శాఖ సంయుక్త సంచాలకుడు మొగలిచెండు సురే్‌షలు తనిఖీ చేశారు. అనంతరం కోవిషీల్డ్‌ టీకాలు వేసే పట్టిక, నమోదు వివరాలు పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, ఎఎన్‌ఎం వెన్నెల, వలంటీర్లు పాల్గోన్నారు.


కొవిడ్‌ నివారణకు సహకరించాలి

సీకేదిన్నె, జూన్‌ 20: కొవిడ్‌ నివారణకు ప్రజలు సహకరించి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల శాఖ సంయుక్త సంచాలకుడు మొగిలిచెండు సురేష్‌ తెలిపారు. మండలంలోని చింతకొమ్మదిన్నె, రసూల్‌పల్లె సచివాలయాల్లో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌రెడ్డి, సచివాలయ సిబ్బంది, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 


టీకా విజయవంతం కావాలి

చెన్నూరు, జూన్‌ 20: స్పెషల్‌ డ్రైవ్‌ కింద కరోనా టీకాలను ఐదు సంవత్సరాల్లోపు చిన్నారుల తల్లులకు ఇవ్వడంలో వంద శాతం సక్సెస్‌ కావాలని టీకా జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ నాగరాజు అన్నారు. చెన్నూరులో ఆదివారం కరోనా వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ప్రోగ్రామ్‌ను ఆయన పరిశీలించారు. మండలానికి 1620 డోస్‌లు వచ్చాయని, మొత్తం 3746 మంది చిన్నారుల తల్లులున్నారని, అందరికీ టీకా అందించాలన్నారు. 

Updated Date - 2021-06-21T05:16:02+05:30 IST