పాన్పులగెడ్డ ఆక్రమణలపై విచారణ

ABN , First Publish Date - 2020-08-07T10:26:00+05:30 IST

మేజరు పంచాయతీ పరిధిలోని పాన్పులగెడ్డ ఆక్రమణలపై డీఎల్‌పీవో, సర్వే అధికారులు గురువారం విచారణ చేట్టారు.

పాన్పులగెడ్డ ఆక్రమణలపై విచారణ

పొందూరు: మేజరు పంచాయతీ పరిధిలోని పాన్పులగెడ్డ ఆక్రమణలపై డీఎల్‌పీవో, సర్వే అధికారులు గురువారం విచారణ చేట్టారు. ఈ ఆక్రమణలపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బండారు ప్రతాప్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బిడ్డేపల్లి దాము ఫిర్యాదుచేశారు. దీనిపై డీఎల్‌పీవో విచారణ జరుపుతుండగా ఫిర్యాదుదారులు, ఆక్రమణదారులకు ఘర్షణ చోటుచేసుకుంది.


ఫిర్యాదుదారులను అధికారుల ఎదుటే దూషించడంతోపాటు బెదిరింపులకు పా ల్పడ్డారు. ఈ ఈగెడ్డలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తొలగించిన తరు వాతే తమవద్దకు రావాలని అధికారులకు ఆక్రమణదారులు చెప్పారు. ఈవో అనూరాధను ఈ భూవివాదంతో మీకేం సంబంధమేమిటని ప్రశ్నించడంతో డీఎల్‌పీవో ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులను ప్రశ్నించే హక్కు మీకెక్కడదని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-08-07T10:26:00+05:30 IST