వినూత్న ఆవిష్కరణలతో ఇంటింటా ఇన్నోవేషన్‌

ABN , First Publish Date - 2022-07-05T04:21:02+05:30 IST

సమాజంలోని వివిధ రకాల సమస్యలను వినూత్న ఆవిష్కరణలతో పరిష్కరించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం మంచి అవకాశమని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.

వినూత్న ఆవిష్కరణలతో ఇంటింటా ఇన్నోవేషన్‌
ఇంటింటా ఇన్నోవేషన్‌ గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఇతర అధికారులు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై  4: సమాజంలోని వివిధ రకాల సమస్యలను వినూత్న ఆవిష్కరణలతో పరిష్కరించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం మంచి అవకాశమని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.   రూపొందించిన ఆవిష్కరణలతో దరఖాస్తు చేసుకోవా లని, ఉత్తమమైన వాటిని గుర్తించి ఆగస్టు 15వ తేదీన   ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఆన్‌లైన్‌ ఎగ్జిబిషన్‌ లింక్‌ ద్వారా ప్రజలు ఆవిష్కరణలను చూడవ చ్చని, ఎంపికైన వారిని ప్రశంస పత్రం అందజేస్తామ న్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, ఇతరత్రా ప్రజా ఉపయోగకర ఆవిష్కర ణలకు ప్రాధాన్యం ఇస్తామని, తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల నిడివి గల వీడియో, ఆవిష్కరణ నాలుగు ఫొటోలు, ఆవిష్కరణ పేరు, ఫోన్‌ నంబర్‌, వయస్సు, వృత్తి, చిరునామా వివరాలను  9100678543నంబర్‌కు ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేయాలని తెలిపారు. అనంతరం ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం గోడప్రతులను ఆవిష్కరించారు. జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్‌కుమాఱ్‌, సెక్టోరల్‌ అధికారి చౌదరి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T04:21:02+05:30 IST