క్రమబద్ధీకరణ పేరిట నిరుపేదలకు అన్యాయం

ABN , First Publish Date - 2022-01-24T04:26:57+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో రూ.4 వేల కోట్ల వసూలుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లో, స్థలా ల్లో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్న వారి నుంచి క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేదలకు అన్యాయం చేస్తోం దని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు.

క్రమబద్ధీకరణ పేరిట నిరుపేదలకు అన్యాయం
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 23 : ఓటీఎస్‌ పేరుతో రూ.4 వేల కోట్ల వసూలుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లో, స్థలా ల్లో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్న వారి నుంచి క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేదలకు అన్యాయం చేస్తోం దని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ 2019 నవంబరు 6న ఇచ్చిన జీవో ప్రకారం వంద గజాలు ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి ఒక రూపాయితోనే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెప్పి, ఇపుడు మరో జీవో తెచ్చి ఆ జీవో ప్రకారం వంద గజాలును 75 గజాలకే కుదించడం దారుణమన్నారు. 75 నుంచి 150 గజాల్లో ఇల్లు నిర్మించుకున్న వారి నుంచి విలువలో 70 శాతం వసూలు చేస్తామని, అంతకు మించి స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి ఏ మేరకు డబ్బులు వసూలు చేయాలో రెవెన్యూ శాఖకు అప్పగిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా స్థలాల క్రమబద్ధీకరణకు 37 వేల దరఖాస్తులు రాగా అందులో 75 గజాలు ఉన్న వారి సంఖ్య 4620 మాత్రమే ఉందన్నారు. మిగతా 32,380 మందితో రూ.3500 కోట్లు వసూలు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. వీరిలో చాలా మంది 40 ఏళ్లకు పైబడి అక్కడ నివాసం ఉన్నవారే అన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అలాగే నాలా పన్ను పేరుతో వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు, ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్‌ వేస్తే దానికి వందశాతంతో జరిమానాతో కలిపి వసూలు చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. సమావేశంలో విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T04:26:57+05:30 IST