అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు అన్యాయం

ABN , First Publish Date - 2021-03-05T06:19:19+05:30 IST

ఎంజీయూ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యంతో యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు అన్యాయం జరిగిందని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్థన్‌గౌడ్‌ అన్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు అన్యాయం
ఎంజీయూ ప్రధాన క్యాంపస్‌ ఎదుట రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

నల్లగొండ క్రైం, మార్చి 4: ఎంజీయూ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యంతో యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు అన్యాయం జరిగిందని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్థన్‌గౌడ్‌ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఎంజీయూ ప్రధాన క్యాంపస్‌ ఎదురుగా గురువారం రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఎంజీయూ పరిధిలో గల డిగ్రీ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులందరికీ న్యాయం చేయాలన్నారు. వారికి ఫీజు లేకుండా రీవాల్యూయేషన్‌ చేయాలని కోరారు. డిసెంబ రులో నిర్వహించిన సెకండ్‌ సెమ్‌లో సుమారు 40వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే కేవలం నాలుగు వేల మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, యూనివర్సిటీ పరీక్షల విభాగం నిర్లక్ష్యంతోనే మిగితా విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌యాదవ్‌, మండల యాదగిరి, శ్రీకాంత్‌, శ్రీను, వేణు, మహేష్‌, వెంకటేశ్‌, స్వాతి, అభిజ్ఞ, ప్రవళిక ఉన్నారు. 


Updated Date - 2021-03-05T06:19:19+05:30 IST