Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంగన్‌వాడీ పోస్టులో దళితులకు అన్యాయం

ప్రొద్దుటూరు అర్బన్‌ డిసెండరు 2 : మున్సిపల్‌ పరిధిలోని  7 వ వార్డులో అంగన్‌వాడీ పోస్టు నియామకంలో దళితులకు అన్యా యం జరుగుతోందని ఎంఆర్‌పీఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గడ్డం నరసంహులు ఆరోపించారు. ఆమేర కు గురువారం అర్బన్‌ ఐసీడీ ఎస్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నరసింహులు మాట్లాడుతూ 7వ వార్డులో అంగన్‌వాడీ కేంద్రం సర్వే మేరకు ఆ డోర్‌ నెంబరులో ఉన్నవారిని లోకల్‌ అభ్యర్థిగా పరిగణించాలని అయితే అందుకు విరుద్ధంగా ఐసీడీఎస్‌ అధికారులు కొం దరు దళారులతో కుమ్మక్కై అర్హులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తా రు. రోస్టర్‌ను అమలు చేయడంలో ఐసీడీఎస్‌ సీడీపీవో కొందరి ఒత్తిళ్ళకు లొంగి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆమెపై జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. 7వవార్డు అంగన్‌వాడీ పోస్టును రీ నోటిపికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ నేతలు దాసరి పాములేటి పిడిఎ్‌సఓ జిల్లా కార్యదర్శి ఓబులేసు పాల్గొన్నారు.


Advertisement
Advertisement