క్రీడా పాఠశాలకు మౌలిక వసతులు

ABN , First Publish Date - 2021-04-11T04:46:17+05:30 IST

నగర రిమ్స్‌ సమీపంలో గల క్రీడా పాఠశాలకు మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమగ్ర శిక్ష పథక అధికారి ఎ.ప్రభాకర్‌రెడ్డి, క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి ఎం.రామచంద్రారెడ్డి వెల్లడించారు.

క్రీడా పాఠశాలకు మౌలిక వసతులు
పాఠశాలను తనిఖీ చేస్తున్న రామచంద్రారెడ్డి

కడప (మారుతీనగర్‌), ఏప్రిల్‌ 10 : నగర రిమ్స్‌ సమీపంలో గల క్రీడా పాఠశాలకు మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమగ్ర శిక్ష పథక అధికారి ఎ.ప్రభాకర్‌రెడ్డి, క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి ఎం.రామచంద్రారెడ్డి వెల్లడించారు. నాడు నేడు పథకం ద్వారా క్రీడా పాఠశాలకు మౌలిక వ సతులు సమకూర్చుకోవడానికి కృషి చేస్తున్నామన్నా రు. ఈ మేరకు శనివారం వారు క్రీడా పాఠశాలను తనిఖీ చేసి మాట్లాడారు. పాఠశాలలో నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతికి 40 మంది ప్రతిభ గల క్రీడాకారులకు విద్యతో పాటు వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో క్రీడా పాఠశాల సిబ్బంది వేణు, రమే్‌షరెడ్డి, పరమేశ్వరితో పాటు కోచ్‌లు శ్రీనివాసరావు, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T04:46:17+05:30 IST