ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో BJP సర్కారు విఫలం: సచిన్ పైలట్

ABN , First Publish Date - 2022-05-18T22:53:39+05:30 IST

ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో BJP సర్కారు విఫలం: సచిన్ పైలట్

ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో BJP సర్కారు విఫలం: సచిన్ పైలట్

జైపూర్: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, బీజేపీ పాలనలో కొత్త రికార్డులను సృష్టిస్తోందని పైలట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం సమస్యపై కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని దోపిడీ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ బుధవారం విమర్శించారు. ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఇతర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.08 శాతానికి ఎగబాకిందని సచిన్ పైలట్ విమర్శించారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యపై బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. దిక్కులేని, విఫలమైన కేంద్ర ప్రభుత్వ పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రోజురోజుకు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయని, ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం 15.08 శాతం నమోదు కావడంతో దేశంలో ద్రవ్యోల్బణం 24 ఏళ్ల అత్యున్నత స్థాయికి చేరుకుందని సచిన్ పైలట్ మండిపడ్డారు.

Updated Date - 2022-05-18T22:53:39+05:30 IST