‘రామగుండం’తో మన యూరియాకు ఊతం

ABN , First Publish Date - 2021-07-14T09:07:12+05:30 IST

తెలంగాణలోని రామగుండంలో యూరియా ప్లాంట్‌ ప్రారంభంతో దేశీయంగా యూరియా ఉత్పత్తికి మరింత ఊతమిచ్చినట్లయ్యిందని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా అన్నారు.

‘రామగుండం’తో మన యూరియాకు ఊతం

ఎండీఏ విధానం సరళీకృతం: కేంద్ర మంత్రి మన్సుఖ్‌

న్యూఢిల్లీ, జూలై 13: తెలంగాణలోని రామగుండంలో యూరియా ప్లాంట్‌ ప్రారంభంతో దేశీయంగా యూరియా ఉత్పత్తికి మరింత ఊతమిచ్చినట్లయ్యిందని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా అన్నారు. ప్రస్తుతం ఉన్నదానికి 12.7లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జత కలిసిందన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో 12.7లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన యూరియా ప్లాంట్‌ త్వరలోనే ప్రారంభం కానుందని చెప్పారు. ఇవి యూరియా ఉత్పత్తిలో దేశం స్వావలంబన సాధించాలన్న ప్రధాని మోదీ ఆశయ సాకారానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మార్కెట్‌ డెవల్‌పమెంట్‌ అసిస్టెన్స్‌(ఎండీఏ) విధానాన్ని సరళీకృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఎండీఏ కింద ప్రస్తుతానికి నగరాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీకి టన్నుకు రూ.1500 రాయితీ ఇస్తుమన్నారు. 

Updated Date - 2021-07-14T09:07:12+05:30 IST