నెలకు రూ.12 వేల జీతమిచ్చే జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. 8 నెలల్లో రూ.కోటి కూడబెట్టిన ఈ మహిళ నిర్వాకాలివీ..!

ABN , First Publish Date - 2022-04-28T17:44:56+05:30 IST

ఆ మహిళ ఓ సాధారణ కుటుంబానికి చెందినది.. తండ్రి ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు..

నెలకు రూ.12 వేల జీతమిచ్చే జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. 8 నెలల్లో రూ.కోటి కూడబెట్టిన ఈ మహిళ నిర్వాకాలివీ..!

ఆ మహిళ ఓ సాధారణ కుటుంబానికి చెందినది.. తండ్రి ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు.. చాలా సాదాసీదా జీవితం గడుపుతుంటాడు.. అయితే ఆ యువతి మాత్రం చాలా విలాసవంతమైన జీవితం అనుభవిస్తోంది.. వీకెండ్స్‌లో పబ్‌లలో పార్టీలు ఇస్తుంటుంది.. విహార యాత్రలు, విమాన ప్రయాణాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నివాసం.. ఇలా ఆమె చాలా రిచ్‌గా జీవనం సాగిస్తోంది.. అయితే ఆమె లగ్జరీ లైఫ్ వెనుక ఓ చీకటి కోణం ఉంది.. ఫేక్ కంపెనీల పేర్లతో చాలా మందిని మోసం డబ్బులు సంపాదించింది.. చివరకు విషయం బయటపడడంతో పోలీసులకు చిక్కింది. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన పూజ ఏడాది క్రితం వరకు రూ.12 వేల జీతానికి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేది. చాలా సాదాసీదాగా జీవితం గడిపేది. అయితే అత్యంత విలాసవంతమైన జీవితం గడపాలనేది ఆమె కోరిక. అందుకే మోసాలకు తెర తీసింది. దాదాజీ ట్రేడర్స్, ఏవై ట్రేడర్స్, ప్రఖార్ జీ ట్రేడర్స్.. ఇలా పలు ఫేక్ కంపెనీలను సృష్టించి పెట్టుబడుల కోసం పలువురు ధనవంతుల చుట్టు తిరిగేది. ఈ కంపెనీల్లో పెట్టుబడులో పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి వారిని ఒప్పించింది. అలా మొత్తం ఎనిమిది నెలల్లో కోటి రూపాయల వరకు సంపాదించింది. 


అలా మోసపోయిన వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పూజపై కన్నేశారు. ఆమెను ట్రాప్ చేసి పట్టుకున్నారు. విచారణలో ఆమె తన మోసాలను అంగీకరించింది. కుటుంబ సభ్యుల పేర్లతోనే ఫేక్ కంపెనీలు సృష్టించినట్టు చెప్పింది. కేసు నమోదు చేసుకుని పూజను అరెస్ట్ చేసిన పోలీసులు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు ఈ నెల 30వరకు ఆమెను పోలీస్ కస్టడీకి అప్పగించింది. 

Updated Date - 2022-04-28T17:44:56+05:30 IST