ఇండోనేషియాలో 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కేసులు

ABN , First Publish Date - 2020-07-09T21:41:11+05:30 IST

ఇండోనేషియాలో గురువారం రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ జావాలోని మిలటరీ

ఇండోనేషియాలో 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కేసులు

జకార్తా: ఇండోనేషియాలో గురువారం రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ జావాలోని మిలటరీ అకాడమీ కాంపౌండ్, పారిశ్రామిక ప్రాంతంలో వైరస్ కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూశాయి. గత 24 గంటల్లో దేశంలో 2,657 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 70,736కు పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, కొత్తగా 58 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,414కు పెరిగింది. ఆగ్నేయాసియాలో అత్యధిక కేసులున్న దేశం ఇండోనేషియానే. కాగా, పశ్చిమ జావాలో 962 కొత్త కేసులు వెలుగు చూడగా, తూర్పు జావాలో 517 కేసులు నమోదయ్యాయి.  


Updated Date - 2020-07-09T21:41:11+05:30 IST