ఇంజన్‌లో vibrations...IndiGo విమానం దారి మళ్లింపు

ABN , First Publish Date - 2022-07-15T17:31:04+05:30 IST

విమానం ఇంజనులో వైబ్రేషన్‌లు కనిపించడంతో ఢిల్లీ నుంచి ఇండిగో విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు....

ఇంజన్‌లో vibrations...IndiGo విమానం దారి మళ్లింపు

న్యూఢిల్లీ : విమానం ఇంజనులో వైబ్రేషన్‌లు కనిపించడంతో ఢిల్లీ నుంచి ఇండిగో విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి వడోదర వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఇంజను కంపించడంతో జైపూర్‌కు మళ్లించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమానం ఇంజనులో సాంకేతిక లోపం కారణంగా ముందుజాగ్రత్త చర్యగా ఈ దారి మళ్లింపు జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశించామని డీజీసీఏ పేర్కొంది.


Updated Date - 2022-07-15T17:31:04+05:30 IST