భారత్‌లో 53 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-20T05:56:14+05:30 IST

భారత్‌ను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. తాజాగా భారత్‌లో కరోనా కే

భారత్‌లో 53 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌ను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 53 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీగా 93,337 కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 53,08,015కు చేరినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోపక్కక గడిచిన 24 గంటల్లో 1,247 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 85,619కు చేరింది. ఇక దేశంలో ఇప్పటివరకు 42,08,432 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 10,13,964 యాక్టివ్ కేసులున్నాయి. ఇక పరీక్షల విషయానికి వస్తే.. సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు ప్రభుత్వం 8,81,911 పరీక్షలను నిర్వహించింది. మొత్తంగా చూసుకుంటే 6 కోట్ల 24 లక్షల 54 వేల 254 పరీక్షలు చేసింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అత్యధిక కేసులు, మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది.


Updated Date - 2020-09-20T05:56:14+05:30 IST