Abn logo
Mar 5 2021 @ 06:14AM

యూఏఈ లాటరీలో రూ.24 కోట్లు గెలుచుకున్న భారతీయుడు

దుబాయ్‌, మార్చి 4: యూఏఈలో  నివాసం ఉంటున్న ఓ భారతీయుడు లాటరీలో భారీ మొత్తంలో 12 మిలియన్ల దిర్హమ్‌ల(రూ.24 కోట్లు)ను గెలుచుకున్నాడు. కర్ణాటకలో శివమొగ్గ జిల్లాకు చెందిన శివమూర్తి కృష్ణప్ప అనే మెకానికల్‌ ఇంజనీర్‌ 15 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారు. ఫిబ్రవరి 17న ఆయన కొన్న లాటరీ టిక్కెట్‌కు ఈ మొత్తం వచ్చినట్లు గల్ఫ్‌ న్యూస్‌ తెలిపింది. ఈ డబ్బుతో స్వగ్రామంలో తన కుటుంబానికి ఒక పెద్ద ఇల్లు నిర్మించాలనుకుంటున్నట్లు కృష్ణప్ప చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి భవిష్యత్‌ కోసం ఎక్కువ మొత్తం డిపాజిట్‌ చేస్తానన్నారు. 

Advertisement
Advertisement
Advertisement