యాపిల్‌ బగ్‌ బౌంటీలో భారతీయుడికి రూ. 75 లక్షలు

ABN , First Publish Date - 2020-06-01T07:28:45+05:30 IST

టెక్‌ దిగ్గజం యాపిల్‌ ‘సెక్యూరిటీ బగ్‌ బౌంటీ ప్రోగ్రాం’లో ఓ భారతీయుడు రూ. 75 లక్షల పారితోషికం పొందారు. థర్డ్‌ పార్టీ యాప్‌ల కోసం ఆ సంస్థ గత ఏడాది ‘సైన్‌ ఇన్‌ విత్‌ యాపిల్‌’ వెసులుబాటును...

యాపిల్‌ బగ్‌ బౌంటీలో భారతీయుడికి రూ. 75 లక్షలు

  • థర్డ్‌పార్టీ ‘సైన్‌ ఇన్‌’లో లొసుగుల గుర్తింపు
  • వెంటనే బగ్‌ను ప్యాచ్‌ చేసిన యాపిల్‌

న్యూఢిల్లీ, మే 31: టెక్‌ దిగ్గజం యాపిల్‌ ‘సెక్యూరిటీ బగ్‌ బౌంటీ ప్రోగ్రాం’లో ఓ భారతీయుడు రూ. 75 లక్షల పారితోషికం పొందారు. థర్డ్‌ పార్టీ యాప్‌ల కోసం ఆ సంస్థ గత ఏడాది ‘సైన్‌ ఇన్‌ విత్‌ యాపిల్‌’ వెసులుబాటును కల్పించింది. యాపిల్‌ యూజర్లు ఎవరైనా.. థర్డ్‌పార్టీ యాప్‌లను వాడాలనుకుంటే.. వాటిల్లో కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. యాపిల్‌ ఐడీ ద్వారా లాగిన్‌ అవ్వొచ్చు. అయితే.. ‘సైన్‌ ఇన్‌ విత్‌ యాపిల్‌’లో లొసుగులు ఉన్నాయని,  భారత్‌కు చెందిన బగ్‌ బౌంటీ హంటర్‌ భావుక్‌ జైన్‌ గుర్తించారు. ఆ వివరాలను యాపిల్‌కు అందజేశారు. దీనికి యాపిల్‌ ద్వారా లక్ష అమెరికన్‌ డాలర్లు (రూ. 75 లక్షలు) అందాయని భావుక్‌ వెల్లడించారు. భావుక్‌ హెచ్చరికతో యాపిల్‌ ఆ బగ్‌ను ప్యాచ్‌ చేసింది.

Updated Date - 2020-06-01T07:28:45+05:30 IST