Indian Armyకి వాతావరణ అనుకూల కొత్త యూనిఫాం

ABN , First Publish Date - 2021-12-03T18:08:45+05:30 IST

భారత సైనికులకు వచ్చే ఏడాది నుంచి తేలికపాటి,వాతావరణ అనుకూల పోరాట యూనిఫామ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది....

Indian Armyకి వాతావరణ అనుకూల కొత్త యూనిఫాం

న్యూఢిల్లీ : భారత సైనికులకు వచ్చే ఏడాది నుంచి  తేలికపాటి,వాతావరణ అనుకూల పోరాట యూనిఫామ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వాతావరణ అనుకూల 'డిజిటల్ డిస్ట్రప్టివ్' పోరాట యూనిఫాంలను వచ్చే ఏడాది జనవరి 15వతేదీన జరగనున్న ఆర్మీ డే పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. ఈ కొత్త ఆర్మీ యూనిఫాం సైనికులకు మరింత సౌకర్యాన్ని అందించనుంది.మన దేశ సైనికులకు కొత్త యూనిఫాం ఎంపిక కోసం పలు దేశాల దుస్తులను పరిశీలించి కొత్త వాతావరణ అనుకూల యూనిఫాంను రూపొందించారు.  వచ్చే ఏడాది ప్రవేశపెట్టాలని భావిస్తున్న కొత్త సైనికుల యూనిఫాంలో ఆలివ్, మట్టి రంగులు ఉంటాయి. సైనికులు పనిచేసే ప్రదేశం వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని భారత సైన్యం కోసం యూనిఫాం రూపకల్పన చేశారు. 


భారత నావికాదళం 2020లో కొత్త యూనిఫామ్‌ను ప్రవేశపెట్టింది.కొత్త యూనిఫాంతోపాటు భారత సైన్యానికి అధునాతన హెరాన్ డ్రోన్లను అందించి నిఘా సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అధునాతన హెరాన్ డ్రోన్లను తూర్పు లడఖ్ ప్రాంతంలో నిఘా కోసం మోహరిస్తామని ఆర్మీ వర్గాలు తెలిపాయి.కౌంటర్ టెర్రరిజం యూనిట్ కార్యకలాపాలకు సహాయపడేందుకు బెల్జియన్ మాలినోయిస్ జాగిలాలను ఇండియన్ ఆర్మీకి అందించనున్నారు.చైనా దేశంతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత రక్షణ దళాల యుద్ధ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి రూ.500 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. 


Updated Date - 2021-12-03T18:08:45+05:30 IST