Abn logo
Sep 19 2020 @ 07:12AM

ఉగ్రవాదుల రహస్యస్థావరంలో తుపాకులు లభ్యం

Kaakateeya

కుప్వారా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా చక్ కిగం సరిహద్దు గ్రామంలో ఉగ్రవాదుల ఆయుధ రహస్య స్థావరాన్ని భారత సైనికులు కనుగొన్నారు. చక్ కిగం గ్రామంలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల రహస్యస్థావరంలో తుపాకులున్నాయని అందిన సమాచారం మేర భారత సైనికులు గాలించారు. సరిహద్దుల్లోని రహస్యస్థావరంలో ఒక ఏకే -47 రైఫిల్, యూబీజీఎల్, కొన్ని గ్రెనెడ్లు లభించాయి. ఉగ్రవాదులు సరిహద్దుల్లో తుపాకులు, గ్రెనెడ్లు దాచి ఉంచారని ఆర్మీ జరిపిన దర్యాప్తులో తేలింది. ఆర్మీ ఉగ్రవాదుల తుపాకులను స్వాధీనం చేసుకుంది. 

Advertisement
Advertisement
Advertisement