Abn logo
Feb 25 2021 @ 17:37PM

డిజిటల్‌ విప్లవంలో ఉద్యోగార్హతపై ఇండియా స్కిల్స్‌ నివేదిక

న్యూఢిల్లీ: కోవిడ్‌ అనంతర కాలంలో భారతదేశంలో ప్రతిభావంతులకు డిమాండ్‌, సరఫరా అనే అంశంపై యూఎన్‌డీపీ, ఏఐయూ, ఏఐసీటీఈ, సీఐఐ, టాగ్డ్‌తో భాగస్వామ్యం చేసుకుని ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ 2021ను వీబాక్స్‌ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఉద్యోగార్హత కలిగిన ప్రతిభావంతులు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నారు. అంతేకాదు దేశంలో 45.9 శాతం మంది యువత అత్యున్నత ఉద్యోగార్హతలు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది.


అలాగే ముంబైలో ఏకంగా 70శాతం మంది అత్యధిక ఉద్యోగార్హతలను కలిగి ఉంటే, దీనిని అనుసరించి హైదరాబాద్‌లోనే ప్రతిభావంతులున్నారని ఆ నివేదిక వెల్లడించింది. భారతీయ డిజిటల్‌ విప్లవంలో ఉద్యోగార్హత పరంగా లింగ సమానత్వం వృద్ధి చెందుతుందని వీబాక్స్ పౌండర్, సీఈవో నిర్మల్ సింగ్ అన్నారు. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే మహిళల భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందింది.

Advertisement
Advertisement