Abn logo
Aug 9 2020 @ 14:12PM

కోవిడ్-19: ఆల్ టైం రికార్డులో ఒక రోజు కేసులు

న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు సరికొత్త రికార్డుని నమోదు చేసుకున్నాయి. ఎప్పుడూ లేని విధంగా మన దేశంలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఇదే ఒకరోజు అత్యధిక నమోదు. కొద్ది రోజులుగా ప్రపంచంలో ఎక్కువ కేసులు మన దేశంలోనే నమోదు అవుతున్నాయి. కాగా ఈరోజు నమోదైన కేసులు దేశంలోనే అత్యధికం.


కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 64,399 కేసులు గడిచిన 24 గంటల్లో నమోదు అయ్యాయి. దీంతో దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,011కు చేరకుంది. కాగా 861 తాజా మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 43,379కు చేరుకుంది. ప్రస్తుతం 628,747 యాక్టివ్ కేసులు దేశంలో కొనసాగుతున్నాయి. 14,80,885 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.


వరుసగా మూడు రోజులుగా దేశంలో 60 వేల మార్కులో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం నాటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షల మార్కును దాటాయి. ఇక దేశ వ్యాప్తంగా 2,41,06,535 కరోనా టెస్టులు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement