అమెరికాలో చమురు నిల్వ చేసేందుకు భారత్ ప్రణాళిక

ABN , First Publish Date - 2020-05-26T22:29:47+05:30 IST

చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో అత్యవసర నిల్వలను పెంచుకుంటున్న భారత్‌ కొత్త సమస్య ఎదురవుతోంది. దేశంలో చమురు నిల్వ చేసేందుకు ఏర్పటైన ప్రత్యేక వసతుల్లో చోటు సరిపోకపోవడంతో అమెరికాలో నిల్వచేసేందుకు బారత్ యోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రథాన్ తెలిపారు.

అమెరికాలో చమురు నిల్వ చేసేందుకు భారత్ ప్రణాళిక

న్యూఢిల్లీ: చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో  అత్యవసర నిల్వలను పెంచుకుంటున్న భారత్‌ కొత్త సమస్య ఎదురవుతోంది. దేశంలో చమురు నిల్వ చేసేందుకు ఏర్పటైన ప్రత్యేక వసతుల్లో చోటు సరిపోకపోవడంతో అమెరికాలో నిల్వచేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రథాన్ తెలిపారు. చౌక ధరలో అందుబాటులోకి వస్తున్న చమురును ఇతర దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో నిల్వచేసే అవకాశాన్ని మేము పరిశీలిస్తున్నాము అని ఆయన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా.. ఆస్ట్రేలియా ఇప్పటికే అమెరకాలో చమురు నిల్వను ప్రారంభించింది. భారత్‌ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ చమురు ధరలు దాదాపు 40 శాతం మేర తగ్గిపోయాయి. దీంతో అనేక దేశాలు అత్యవసర సందర్భాల కోసం చౌక ధరల్లో చమురును కొనుగోలు చేసి నిల్వచేసుకుంటున్నాయి. భారత్ ఇప్పటికే దాదాపు 5.3 మిలియన టన్నుల మేల అత్యవసర నిల్వలను సమచూర్చుకున్నదని, వివిధ దేశాల్లో మరో 9 మిలియన్ టన్నులను గల్ఫ్ దేశాల్లో నిల్వచేస్తోందని మంత్రి తెలిపారు. 


Updated Date - 2020-05-26T22:29:47+05:30 IST