చైనా దూకుడు.. సరిహద్దు వద్ద మళ్లీ...

ABN , First Publish Date - 2020-08-31T17:24:56+05:30 IST

భారత్‌ను మరోసారి రెచ్చగొట్చేందుకు చైనా ప్రయత్నించింది. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద దూకుడుగా తన ఆర్మీ కదలికను ప్రోత్సహిస్తూ భారత్ సైన్యాన్ని భారత్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని ఆర్మీ సోమవారం ప్రకటించింది. ఆగస్టు 29 ఆర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే తాము చైనా ఆటలు సాగనీయలేదని వారన్నారు.

చైనా దూకుడు.. సరిహద్దు వద్ద మళ్లీ...

న్యూఢిల్లీ: భారత్‌ను మరోసారి రెచ్చగొట్చేందుకు చైనా ప్రయత్నించింది. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద దూకుడుగా తన ఆర్మీ కదలికను ప్రోత్సహిస్తూ యథాతథ స్థితిని మార్చే ప్రయత్నం చేసిందని భారత ఆర్మీ సోమవారం ప్రకటించింది. ఆగస్టు 29 ఆర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే తాము చైనా ఆటలు సాగనీయలేదని వారన్నారు. 


‘చైనా ఆర్మీ కదలికలను ముందుగానే గుర్తించి మేము పటిష్ట చర్యలను తీసుకున్నాం. ఏకపక్షంగా యథాతథస్థితిని మార్చాలనుకున్న చైనా వ్యూహాన్ని భగ్నం చేశాం’ అని భారత్ ఆర్మీ పీఆర్‌ఓ కల్నల్ ఆమన్ ఆనంద్ మీడియాకు తెలిపారు. ‘చర్చల ద్వారా శాంతిని నెలకొల్పేందుకు భారత్ కట్టుబడి ఉంది. అదే స్థాయిలో.. తన సమగ్రతను కాపాడుకునేందుకు భారత్ పోరాడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి’ అని ఆయన తెలిపారు.


సరస్సుకు దక్షిణాన ఉన్న సరిహద్దును ఉల్లఘించేందుకు చైనా ప్రయత్నించిందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ.. సరస్సుకు ఉత్తరాన ఉన్న ప్రాంతానికే ఉద్రిక్తలు పరిమితమయ్యాయి. 


తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభన తొలగాలంటే ఇరు దేశాలకు పరస్పర ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవాలని భారత్ గత వారమే స్పష్టం చేసింది. గతంలో వెలుగు చూసిన వివాదాలన్ని చర్చల ద్వారానే పరిష్కారమయ్యాయన్న విషయాన్ని కూడా  ప్రస్తావించింది. పరిస్థితి పూర్తిగా కుదుటపడాలంటే.. ఇరు దేశాలూ తమ సైన్యాన్ని మునుపటి సాధారణ సైనిక స్థావరాలకు పరిమితం చేయాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అప్పట్లో తేల్చిచెప్పారు. 

Updated Date - 2020-08-31T17:24:56+05:30 IST