కరోనా టెస్టుల విషయంలో భారత్ స్వావలంబన సాధించింది: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-07-05T01:04:13+05:30 IST

కరోనా పరీక్షల విషయంలో భారత్ స్వాలంబన సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్యా స్వామినాథన్ వ్యాఖ్యానించారు.

కరోనా టెస్టుల విషయంలో భారత్ స్వావలంబన సాధించింది: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనా పరీక్షల విషయంలో భారత్ స్వావలంబన సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్యా స్వామినాథన్ వ్యాఖ్యానించారు. ‘గత రెండు నెలల్లో భారత్ టెస్టుల అంశంలో స్వావలంబన సాధించింది. కరోనా పరీక్షలను అందరికీ అందుబాటులోకి తేగలిగింది. ఇది భారత్‌కు ఓ పెద్ద విజయం’ అని ఆమె అభిప్రాయపడ్డారు.


కరోనా నివారణ కోసం భారత ప్రభుత్వం మొదటి నుంచీ అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టిందన్నారు. జనవరి నెల నుంచి రంగంలోకి దిగిందని ప్రసంశించారు. అంటువ్యాధులను లొంగదీసుకోవడంలో సమాచారం పాత్ర చాలా కీలకమైనదని ఆమె తెలిపారు. ‘ప్రతి పది లక్షల జనాభాకు ఎన్ని కేసులు వెలుగు చూశాయి, అవి ఎక్కడ నమోదయ్యాయి అనే అంశాలు చాలా ముఖ్యం. ఇవన్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలపైనే ఆధారపడతాయి’ అంటూ కరోనా పరీక్షల ప్రాముఖ్యాన్ని వివరించారు. 

Updated Date - 2020-07-05T01:04:13+05:30 IST