కరోనా: నిన్న ఇటలీ.. నేడు స్పెయిన్‌ను దాటిపోయిన భారత్!

ABN , First Publish Date - 2020-06-07T16:28:26+05:30 IST

భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో దేశం కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 9,971 కేసులు నమోదయ్యాయని ఆదివారం నాడు ఆరోగ్య శాఖ ప్రకటించడంతొ..భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య2,46,628 కి చేరుకుంది. దీంతో కరోనా కేసుల సంఖ్యలో భారత్ తాజాగా స్పెయిన్‌‌నూ అధికమించి ఐదో స్థానానికి చేరుకుంది.

కరోనా: నిన్న ఇటలీ.. నేడు స్పెయిన్‌ను దాటిపోయిన భారత్!

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో సంక్షోభం తీవ్రత నానాటికీ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 9,971 కేసులు నమోదయ్యాయని ఆదివారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించడంతో..భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య2,46,628 కి చేరుకుంది. దీంతో కరోనా కేసుల సంఖ్యలో భారత్ తాజాగా స్పెయిన్‌‌ను అధికమించి ఐదో స్థానానికి చేరుకుంది.


శనివారం నాడు ఇటలీ కంటే ఎక్కువ కేసులతో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఒక్కరోజులోనే స్పెయిన్‌ను దాటిపోయింది. ప్రార్థనాలయాలు, షాపింప్ మాల్స్, రెస్టారెంట్లు పూర్తి స్థాయిలో తెరిచేందుకు ఇంకా ఒక్కరోజే మిగులున్న నేపథ్యంలో తాజాగా పరిణామం ఆందోళన కలిగిస్తోంది. 


ఆరోగ్య శాఖ ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 287 కరోనా మరణాలు సంభించాయి. రోజువారీ మరణాల సంఖ్యలో ఈ స్థాయి పెరుగుదల నమోదవడం ఇదే తొలిసారి. అంతే కాకుండా.. వరుసగా నాలుగో రోజు దేశంలో 9 వేల పైచిలుకు కేసులు నమోదుకావడం ఆందోళన కలిగించే మరో అంశం.


ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1,20,406కాగా.. ఇప్పటి వరకూ 6,929 మంది కరోనాకు బలైపోయారని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 1,19,292 కరోనా పీడుతులు కోలుకుని ఇళ్లకు వెళ్లడంతో దేశంలో రికవరీ రేటు 48.36 శాతానికి ఎగబాకింది. ఏప్రిల్ 29 నాటికి 24.5 శాతంగా ఉన్న ఈ రేటు తాజా సమాచారం ప్రకారం రెండింతలైనట్టు తేలింది. కరోనా బాధితుల  నిర్వహణలో భారత్ సఫీలకృతమవుతోందనటాడిని పెరుగుతున్న రికవరీ రేటే నిదర్శనమని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.


ఇక కరోనా తీవ్రతకు సంబంధించి తొలి పదిస్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్ ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో ఈ పది రాష్ట్రాల వాటా దాదాపు 84 శాతం. మొత్తం కరోనా మరణాల్లో 95 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.


మరోవైపు.. భారత వైద్య పరిశోధన నియంత్రణ సంస్థ..దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను మరింత పెంచింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  520 ప్రభుత్వ ల్యాబోరేటరీలు, 220 ప్రైవేటు ల్యాబొరేటరీల్లో ఈ పరీక్షను జరుపుతున్నారు. జూన్ నెలాఖరు నాటికి ప్రతిరోజు రెండు లక్షల పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యాన్ని ఐసీఎమ్ఆర్ నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయానికి కచ్చితంగా చేరుకుంటామని ఐసీఎమ్ఆర్ ప్రతినిధి రజనీకాంత్ శ్రీవాత్సవ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-07T16:28:26+05:30 IST