Abn logo
Jun 24 2021 @ 10:23AM

దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 54,069 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... 1,321 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 68,885 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778కి చేరగా...కోలుకున్న వారి సంఖ్య 2,90,63,740గా ఉంది. దేశంలో యాక్టీవ్ కేసులు 6,27,057ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో 3,91,981 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 30,16,26,028గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.