దావూద్‌ సహా ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం

ABN , First Publish Date - 2020-08-08T08:39:23+05:30 IST

ఐక్యరాజ్యసమితి సాక్షిగా భారత్‌.. పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. తమకు వ్యతిరేకంగా పొరుగుదేశం.. దావూద్‌ సహా ఇతర నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కొనసాగిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి...

దావూద్‌ సహా ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం

  • భద్రతా మండలికి భారత్‌ ఫిర్యాదు


ఐక్యరాజ్యసమితి, ఆగస్టు 7: ఐక్యరాజ్యసమితి సాక్షిగా భారత్‌.. పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. తమకు వ్యతిరేకంగా పొరుగుదేశం.. దావూద్‌ సహా ఇతర నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కొనసాగిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి తీసుకెళ్లింది. గురువారం జరిగిన సమావేశంలో భారత్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాల మధ్య గల సంబంధంపై జరిగిన చర్చలో పాల్గొంది. భారత్‌ ఎన్నో ఏళ్లుగా సీమాంతర ఉగ్రవాదంతో సమస్యలు ఎదుర్కొంటోందని పేర్కొంది. దావూద్‌, ఇతర ఉగ్రవాదులు కలిసి భారత్‌లో అశాంతి రేకెత్తించేందుకు పొరుగుదేశం వేదికగా కుట్రలు పన్నుతున్నారని ఫిర్యాదు చేసింది.


Updated Date - 2020-08-08T08:39:23+05:30 IST