Abn logo
Aug 9 2020 @ 13:33PM

భారత్, చైనా మధ్య 10 గంటల పాటు చర్చలు

న్యూఢిల్లీ : భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చలు జరపడానికి ఇరు దేశాల మేజర్ జనరల్ అధికారులు సమావేశమయ్యారు. జూన్ 15 తర్వాత తొలిసారి మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. డెప్సాంగ్ వద్ద పరిస్థితిని ఇరు వర్గాలు చర్చించారు. దాదాపు 10 గంటలకు పైగా చర్చలు జరిగినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.


సరిహద్దుల్లో పెట్రోలింగ్ విధానాలపై సాధారణ చర్చలు జరిపారని, ఈ చర్చల్లో బలగాల ఉప సంహరణపై ప్రస్తావనే రాలేదని పేర్కొన్నాయి. ప్రధానంగా ‘డెప్సాంగ్’ మైదానాలకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికే ఈ మేజర్ జనరల్ స్థాయి భేటీ జరిగతింది. ఇప్పటి రవకూ కమాండర్ స్థాయి సైనిక చర్చల్లో గల్వాన్ లోయ, గోగ్రా, పాంగోంగ్‌త్సోలోని ఫింగర్ స్టాండ్ ఆఫ్ ప్రాంతాలపైనే చర్చలు జరిపారు. 

Advertisement
Advertisement
Advertisement