Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 27 Jan 2022 00:17:59 IST

త్యాగధనుల కృషి ఫలితమే స్వాతంత్య్రం

twitter-iconwatsapp-iconfb-icon
త్యాగధనుల కృషి ఫలితమే స్వాతంత్య్రంజెండావందనం చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, జేసీలు

ఘనంగా గణతంత్ర వేడుకలు

రూ.332.50 కోట్ల ఆస్తులు లబ్ధిదారులకు పంపిణీ

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ప్రతిభకనబరిచిన 259 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

కలెక్టర్‌ విజయరామరాజు

కడప (కలెక్టరేట్‌), జనవరి 26 : ఎందరో త్యాగధనుల త్యాగఫలితంగా స్వాతంత్య్రం లభించిందని, రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 సంవత్సరాలైందని, అందుకే దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని కలెక్టర్‌ వి.విజయరామరాజు తెలిపారు. బుధవారం పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలను కలెక్టర్‌ ప్రారంభించారు. వేడుకల్లో కలెక్టర్‌తో పాటు ఎస్పీ కేకేఎన అన్బురాజన, జాయింట్‌ కలెక్టర్‌లు ఎం.గౌతమి, సీఎం సాయికాంతవర్మ, హెచఎం.ధ్యానచంద్ర, డీఆర్వో మలోల, ఆర్డీవోల ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీతో కలిసి కలసి మైదానంలో పెరేడ్‌ను పరిశీలించారు. జిల్లాలో ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి సందేశం ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలోనే ఆదర్శవంతంగా అన్ని వర్గాల వారికి గ్రామ, వార్డుసచివాలయాల ద్వారా అర్హులకు పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రజలను ముందుకు తీసుకెళుతున్న తరుణంలో ప్రపంచ దేశాలను ఆర్థికంగా వణికించి, ఆర్థిక రంగాన్ని కుదేలు చేసిన అతిపెద్ద కొవిడ్‌ విపత్తును కూడా ప్రభుత్వం ఎదుర్కొని నియంత్రణ చర్యలు పటిష్టంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిశాయన్నారు. మన జిల్లా సాధారణ వర్షపాతం 647 మి.మీ.కు గాను అఽధికంగా 1008 మి.మీ. వర్షపాతం నమోదైందనీ, నవంబరు మాసంలో సాధారణ వర్షపాతం కన్నా 324 శాతం అధిక వర్షాలు కురిశాయన్నారు. జిల్లాలోని 14 ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి కృషి ఫలితంగా గండికోట ప్రాజెక్టులో రెండోసారి 26.85 టీఎంసీల నీరు నిల్వ చేసుకున్నామన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ప్రతిరైతుకు పెట్టుబడి సాయం ప్రతి ఏటా రూ.13,500లు ఇస్తోందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనలో రైతులకు 98,826 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు రాయితీ కింద ఇచ్చామన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినన రైతులకు రూ.140 కోట్లు పెట్టబడి రాయితీ ఇవ్వడం జరిగిందన్నారు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.5.75 కోట్లు పెట్టుబడి రాయితీకి ప్రతపాదనలు పంపామన్నారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 620 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ప్రోత్సాహంతో సూక్ష్మ ఆహార- శుద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద 35 శాతం రుణ అనుసంధానంతో రాయితీని గరిష్టంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం వైఎస్‌ఆర్‌ జీవక్రాంతి, పశునష్ట పరిహారం, పెన్షన కానుక వైఎస్‌ఆర్‌ చేయూత. అమ్మఒడి, ఆసరా, ఆరోగ్యశ్రీ, నాడు-నేడు పథకాలు, విద్యాకానుక, గోరుముద్ద, స్మార్ట్‌టౌనషిప్‌ తదితర అనేక సంక్షేమ పథకాల గురించి కలెక్టర్‌ ఆ సందేశంలో  ప్రజలకు  వివరించారు.  రూ.332.55 కోట్లు ఆస్తులను కలెక్టర్‌ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు సంబంధించి దాదాపు పది శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 


అబ్బుర పరిచిన విద్యార్థుల నృత్యాలు, విన్యాసాలు 

ఆకట్టుకున్న గుర్రపు స్వారీ, ఫైర్‌ విన్యాసాలు 

300 మందికి ప్రశంసాపత్రాలు 

కడప(క్రైం), జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో వేడుకల్లో భాగంగా పలు పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు నిర్వహించిన విన్యాసాలు, కర్రసాము అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గేయాలకు నృత్య రూపంలో ప్రదర్శించారు. దేశభక్తిపై వారు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. గుర్రపు స్వారీ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు గుర్రపు స్వారీ చేసి అందరినీ అబ్బురపరిచారు. 


ప్రభుత్వ శకటాల ప్రదర్శన 

గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, విద్యుత, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, జిల్లా గ్రామీణాభావిృద్ధి శాఖ, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా), అటవీశాఖ, గృహ నిర్మాణ శాఖ, విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి (ఐసీడీఎస్‌), పౌర సరఫరాల శాఖ, పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి సంస్థ, జిల్లా సర్వే భూమి రికార్డుల శాఖ, అగ్నిమాకప శాఖ, పోలీస్‌ శాఖల ప్రగతి శకటాలను ప్రదర్శించారు. ఆ శకటాలపై ఆయా శాఖల సిబ్బంది, ఆ పథకాల విశిష్టతను వివరిస్తూ వచ్చారు. 


300 మందికి ప్రశంసాపత్రాలు 

జిల్లాలోని వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనుబరిచిన ఉద్యోగులను ఎంపిక చేసి వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌, కడప ఆర్డీవో ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు, డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి, కడప అగ్రికల్చరల్‌ ఏడీ మురళీకృష్ణ, పశు సంవర్థక శాఖ జేడీ సత్యప్రకాష్‌, ఏపీఎంఐపీ ఏపీడీ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన ఈడీ వెంకటసుబ్బయ్య,  సొషల్‌ వెల్ఫేర్‌ జేడీ జయప్రకాష్‌, డీఎంహెచవో ఎ.నాగరాజు, బీసీహెఎచఎ్‌స రామేశ్వరుడు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌) సూపరింటెండెంట్‌ వీఎంఆర్‌వి ప్రసాద్‌రావు, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడి ్మనిస్ర్టేషన ఏడీ చంద్రారావు, జిల్లా కోఆపరేటీవ్‌ ఆఫీసర్‌ సుభాషిణి, ఎండోమెంట్‌ ఏసీ శంకర్‌ బాలాజీ, గ్రౌండ్‌ వాటర్‌ డీడీ మురళీధర్‌, మైన్స అండ్‌ జ్యువాలజీ ఏడీ రవికుమార్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ఏబీ సురేంద్రనాధ్‌రెడ్డి, కడప కార్పొరేషన కమిషనర్‌ యు.రంగస్వామి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ చెన్నకేశవరెడ్డి, జిల్లా ఫైర్‌ అధికారి వై.హనుమంతరావు, ఏపీఎస్‌ పీడీసీఎల్‌ ఎస్‌ఈ శోభావాలెన్టీనా, ప్రొద్దుటూరు ఆర్టీవో వీర్రాజు, లీడ్‌ డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌ దుర్గాప్రసాద్‌, డిస్ర్టిక్ట్‌ మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మస్తానవలి, స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి, అడిషనల్‌ ఎస్పీ దేవప్రసాద్‌, అడిషనల్‌ ఎస్పీ ఏఆర్‌ మహే్‌షకుమార్‌, డీఎస్పీలు శివారెడ్డి, శ్రీనివాసులు, నాగరాజు, శివభాస్కర్‌రెడ్డి, శ్రీధర్‌, బాలస్వామిరెడ్డి, రవికుమార్‌, సుధాకర్‌, వాసుదేవన, చెంచుబాబు, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్యలు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీరితో పాటు అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 


ఆకట్టుకున్న ఎస్పీ కూతురు, కుమారుడు

గణతంత్ర  వేడుకల్లో భాగంగా ఎస్పీ కేకేఎన అన్బురాజన కుమారుడు సంప్రదాయ దుస్తులు ధరించి కర్రసాములో మంచి ప్రతిభ కనబరిచాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఆపదలో ఉన్నప్పుడు ఎలా అడ్డుకుంటారో పై మైదానంలో చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఎస్పీ కుమార్తె అయితే దేశ భక్తిగీతాలకు నృత్యప్రదర్శన చేయడంతో పాటు జాతీయ గీతాలకు ఆ చిన్నారి చేసిన ప్రదర్శన  అందరినీ అలరించింది.


స్టాల్స్‌ పరిశీలించిన అధికారులు 

ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్‌, ఎస్పీలతో పాటు జిల్లా అధికారులు పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఫైన ఆర్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన ఆధ్వర్యంలో జాతీయ నాయకులు, స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు ఆకట్టుకున్నాయి.  


 Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.