గాంధీ జయంతి నుంచి కార్మికుల నిరవధిక సమ్మె

ABN , First Publish Date - 2022-09-23T05:29:17+05:30 IST

దీర్ఘకాలికంగా పెం డింగ్‌లో ఉన్న తమ సమస్యల్ని అక్టోబర్‌ 1వ తేదీ నాటికి పరిష్కరించకుంటే ఆ మరుసటి రోజైన గాంధీ జయంతి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని ఏపీ గ్రామ పంచాయ తీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ అసోసియేష న్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామయ్య తెలిపారు.

గాంధీ జయంతి నుంచి కార్మికుల నిరవధిక సమ్మె
సర్పంచ్‌, కార్యదర్శికి నోటీసు అందజేస్తున్న వెంకటరామయ్య

పీలేరు, సెప్టెంబరు 22: దీర్ఘకాలికంగా పెం డింగ్‌లో ఉన్న తమ సమస్యల్ని అక్టోబర్‌ 1వ తేదీ నాటికి పరిష్కరించకుంటే ఆ మరుసటి రోజైన గాంధీ జయంతి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని ఏపీ గ్రామ పంచాయ తీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ అసోసియేష న్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన తోటి కార్మికులతో కలిసి గురువారం పీలేరు సర్పంచ్‌ డాక్టర్‌ హబీబ్‌ బాషా, కార్యదర్శి రెడ్డిప్రసాద్‌కు సమ్మె నోటీసు అందేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న అరకొర వేతనాలు కూడా చాలా చోట్ల రెండు నెలల నుంచి 36 నెలల వరకు బకాయిలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు నాగార్జున, పులి రెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు. ===========================================================================================


Updated Date - 2022-09-23T05:29:17+05:30 IST