పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. వ్యాక్సిన్‌ కోసం తరలొస్తున్న జనాలు

ABN , First Publish Date - 2021-04-13T07:22:39+05:30 IST

ఖానాపూర్‌లో రోజురోజుకూ కోవిడ్‌ -19 పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న వేళ ప్రజల్లో కోవిడ్‌వ్యాక్సిన్‌ తీసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. వ్యాక్సిన్‌ కోసం తరలొస్తున్న జనాలు
టీకా తీసుకునే వారి వివరాలు నమోదు చేస్తున్న దృఽశ్యం

ఖానాపూర్‌, ఏప్రిల్‌ 12 : ఖానాపూర్‌లో రోజురోజుకూ కోవిడ్‌ -19 పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న వేళ ప్రజల్లో కోవిడ్‌వ్యాక్సిన్‌ తీసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. నిన్న మొన్నటి వరకు కొవిడ్‌ టీకాలు తీసుకోవాలని వైద్య సిబ్బంది ఎంత చెప్పినా పట్టించుకోని ప్రజలు సోమవారం టీకా కేంద్రం వద్దకు తరలివచ్చి క్యూకట్టారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు 25 ఏళ్లు నిండిన పలువురు వ్యక్తులు టీకాను తీసుకున్నారు. సోమవారం ఖానాపూర్‌ ప్రభుత్వాసుపత్రిలో 181 మందికి కోవిషిల్డ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు హెల్త్‌ సూపర్‌వైజర్‌ కన్నయ్య తెలిపారు. మరోవైపు ప్రభుత్వాసుపత్రిలో సోమవారం 103 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి కరోనా పాజిటీవ్‌గా నిర్దారణ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వంశీమాధవ్‌ తెలిపారు. ఓ వైపు పరిక్షలు చేసుకునేందుకు వచ్చిన జనం, మరో వైపు టీకాలు తీసుకునేందుకు వచ్చిన జనంతో ఆసుపత్రి ఆవరణలో క్యూలైన్‌లలో నిలబడిన ప్రజలతో కిక్కిరిసిపోయింది. జనం అధికంగా రావడంతో పరిక్షలు నిర్వహించేందుకు కేవలం ఒక్కరే ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉండడంతో ఇబ్బంది తప్పలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖానాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి మరో ఇద్దరు ల్యాబ్‌ టెక్నిషియన్‌లను అందుబాటులో ఉంచేలా జిల్లా కలెక్టర్‌ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

వ్యాక్సిన్‌పై అవగాహన

కుంటాల, ఏప్రిల్‌ 12 : అంగన్‌వాడీ ఆధ్వర్యంలో సోమ వారం మండలంలోని అందకూర్‌ గ్రామంలో కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బంది శారదతో పాటు పలువురు మహిళ సంఘాల సభ్యులకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసు కోవాలని కరోనావైరస్‌ నిర్మూలనకు భౌతికదూరం పా టించాలని, మాస్కులను ధరించాలని అవగాహన కల్పిం చారు. 

30 కరోనా పాజిటీవ్‌ కేసులు

కుభీర్‌, ఏప్రిల్‌ 12 : మండలంలో సోమవారం నిర్వహిం చిన కరోనాటెస్టుల్లో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో 123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్‌ వచ్చి నట్లు డా. అవినాష్‌ పేర్కొన్నారు.

44 మందికి పాజిటివ్‌

కుంటాల, ఏప్రిల్‌ 12 : మండల కేంద్రంలోని పిహెసీలో సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 44 మందికి పాజిటీవ్‌ వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు. 104 మందికి పరీక్షలు నిర్వహించగా 44 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. 

Updated Date - 2021-04-13T07:22:39+05:30 IST