పెరిగిన దిగుబడి..తగ్గుతున్న టమోటా ధర!

ABN , First Publish Date - 2022-06-30T05:08:48+05:30 IST

మదనపల్లె డివిజనలో టమోటా దిగుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో డిమాండ్‌ తగ్గిపోయి ధరలు అంతకంతకు పడిపోతున్నాయి.

పెరిగిన దిగుబడి..తగ్గుతున్న టమోటా ధర!
బుధవారం మార్కెట్‌కు వచ్చిన టమోటాలు

మదనపల్లె టౌన, జూన 29: మదనపల్లె డివిజనలో టమోటా దిగుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో డిమాండ్‌ తగ్గిపోయి ధరలు అంతకంతకు పడిపోతున్నాయి. బుధవారం  మదనపల్లె మార్కె ట్‌కు 1656 టన్నుల టమోటా విక్రయానికి రావడంతో, వేలం పాటలు ఆలస్యంగా జరిగాయి. రైతులు తీసుకొచ్చిన టమోటాలను కొను గోలు చేసే వ్యాపారులు లేకపోవడంతో తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. మొదటి రకం టమోటా గరిష్టంగా కిలో రూ.16 ధర పలకగా, రెండో రకం కనిష్టంగా కిలో రూ.7 మాత్రమే పలికింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కిలో రూ.2కు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Updated Date - 2022-06-30T05:08:48+05:30 IST