పెరిగిన విద్యుత్‌ వినియోగం

ABN , First Publish Date - 2022-05-26T05:48:41+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.

పెరిగిన విద్యుత్‌ వినియోగం
సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం

  ఏప్రిల్‌లో గరిష్ఠంగా 7.54 మిలియన్‌ యూనిట్ల వాడకం

 మార్చితో పోలిస్తే 6 లక్షల యూనిట్ల అదనం


సంగారెడ్డి టౌన్‌, మే 25: సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఉక్కబోత కారణంగా ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను ఎక్కువగా వాడడంతో విద్యుత్‌ వినియోగం కూడా పెరిగింది. ఈ సంవత్సరం మార్చిలో జిల్లాలోని గృహావసరాలకు వినియోగించే కేటగిరి-1 కింద 5.03 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం అయింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే కేటగిరి-2 కింద 1.23 మిలియన్‌ యూనిట్లు వినియోగించారు. పరిశ్రమలకు వినియోగించే కేటగిరి-3 కింద 64.22 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. అలాగే వ్యవసాయ అవసరాలకు వినియోగించే కేటగిరి-4 కింద కేవలం 2.44 లక్షల యూనిట్ల వాడకం అయింది. అంటే మార్చి మొత్తం మీద 6.93 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌ నెలలో 6లక్షల యూనిట్ల విద్యుత్‌ను అదనంగా వినియోగించారు. మార్చిలో అన్ని కేటగిరీలకు కలిపి 6.93 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగితే ఏప్రిల్‌లో 7.54 మిలియన్‌ యూనిట్లు వినియోగించారు. ఏప్రిల్‌ నెలలో గృహావసరాలకు 5.57 మిలియన్‌ యూనిట్లు, వాణిజ్యపరమైన అవసరాలకు 1.28 మిలియన్‌ యూనిట్లు, పరిశ్రమల్లో 65.80 లక్షల యూనిట్లు, వ్యవసాయానికి 2.44 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. కాగా గతేడాది మార్చిలో గృహావసరాలకు 4.41 మిలియన్‌ యూనిట్లు, వాణిజ్యావసరాలకు 10.5 మిలియన్‌ యూనిట్లు, పరిశ్రమలకు 65.38 లక్షల యూనిట్లు, వ్యవసాయానికి 2.35 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వాడారు. మొత్తంగా 6.14 మిలియన్‌ యూనిట్లు వినియోగించారు. అలాగే ఏప్రిల్‌లో గృహావసరాలకు 4.86 మిలియన్‌ యూనిట్లు, వాణిజ్య అవసరాలకు 97.35 లక్షల యూనిట్లు, పరిశ్రమలకు 55.03 లక్షల యూనిట్లు, వ్యవసాయానికి 2.35 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. మొత్తంగా 6.41 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ను వాడారు. 


సంగారెడ్డి జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్లు


సంగారెడ్డి జిల్లాలో అన్ని కేటగిరీలకు కలిపి మొత్తం 6,46,317 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కేటగిరీ-1 కింద (గృహాలకు) 4,98,663, కేటగిరి-2 కింద (వాణిజ్యం) 55,760, కేటగిరి-3 కింద (పరిశ్రమలు)3,489, కేటగిరీ-4 కింద (వ్యవసాయం) 88,405 విద్యుత్‌ కనెక్షన్లున్నాయి.


 

Updated Date - 2022-05-26T05:48:41+05:30 IST