ఆశలు పచ్చగా

ABN , First Publish Date - 2020-07-11T10:38:15+05:30 IST

మొట్ట భూముల్లో వర్షాధారం కింద సాగు చేసిన పంట పచ్చగా కళకళలాడుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం తర్వాత

ఆశలు పచ్చగా

కురుస్తున్న వానలతో కళకళలాడుతున్న పంటలు

పెరిగిన సాగు విస్తీర్ణం 

2 లక్షల హెక్టార్లల్లో వేరుశనగ సాగు 

రైతుల్లో తొణికిసలాడుతున్న ఆనందం


అనంతపురం వ్యవసాయం, జూలై 10  :  మొట్ట భూముల్లో వర్షాధారం కింద సాగు చేసిన పంట పచ్చగా కళకళలాడుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం తర్వాత వరుసగా పదును వర్షాలు పడటంతో పంటల సాగు పెరుగుతూ వస్తోంది. గత నెల ఆరంభంలో అరకొరగా వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత పదును వర్షం పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పంటల సాగు ఊపందుకుంది. గత నెల మొదటి, రెండో వారం వేసిన పంట మరో పక్షం రోజుల్లో పూత దశకు చేరుకోనుంది. వరుసగా వర్షాలు పడుత ుండటం, పైరు పచ్చగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  


వర్షాలతో రెట్టింపు ఉత్సాహం 

ఈనెలారంభం నుంచి వర్షాలు పడుతుండటంతో రైతుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. పదును వర్షాలు పడిన ప్రాంతాల్లో పంటల సాగు చేయడంలో అన్నదాతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. గత నెలలో వేసిన పంటలు పచ్చగా ఉండటంతో అన్నదాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా 106.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గత నెలలో 51 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.


అలాగే 10 మండలాల్లో సాధారణ వర్షపాతం, రెండు మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈనెల సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా ఇప్పటి దాకా 29.7 మి.మీ వర్షపాతం నమోదైంది. గత పది రోజులుగా 50 మండలాల్లో పదును వర్షం పడింది. మరో 11 మండలాల్లో సాఽధారణ వర్షపాతం నమోదైంది. రెండు మండలాల్లో సాధా రణం కంటే తక్కువ వర్షం పడింది. జిల్లాలోని 16 మండలాల్లో గురువారం వర్షం పడింది. అత్యధికంగా అమరాపురంలో 30 మి.మీ వర్షపాతం నమోదైంది. కంబదూరు 17.4, కుందుర్పి 20, మిగిలిన మండలాల్లో 5.2 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. 


2 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు 

జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఇప్పటి దాకా 2 లక్షల హెక్టార్లల్లో వేరుశనగ సాగు చేశారు. మరో 50 వేల హెక్టార్లల్లో కంది, సజ్జ, రాగి, మొక్కజొన్న, ప్రత్తి, ఆముదం, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగయ్యాయి. ఇప్పటి దాకా అత్యధికంగా అనంతపురం, ఆత్మకూరు, కూడేరు, ముదిగుబ్బ, కంబదూరు, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, బొమ్మనహాళ్‌, రొద్దం, మడకశిర, గుడిబండ, రొళ్ల, కొత్తచెరువు, బుక్కపట్నం, గుత్తి, ధర్మవరం, రాప్తాడు, తదితర మండలాల్లో వేరుశనగ పంట సాగైనట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి.


ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 6.83 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇందులో వేరుశనగ 4.60 లక్షల హెక్టార్లు, కంది 53వేల హెక్టార్లు, మిగిలిన విస్తీర్ణంలో జొన్న, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, ఆముదం, ఉలవలు, పెసలు, అలసంద తదితర పంటలు సాగవుతాయని జిల్లా వ్యవ సాయ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకు 2.5 లక్షల హెక్టార్లలో వేరుశనగతోపాటు ఇతర రకాల పంటలు సాగయ్యాయి. 


పంటల సాగు పెరుగుతోంది  

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైన తర్వాత పదు ను వర్షాలతో ఆశించిన మేరకు పంటలు సాగవుతున్నాయి. తాజాగా కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వేరుశనగతో పాటు ఇతర రకాల పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. జూలై నెలలో సాధారణ వర్షపాతం నమోదవతుందని వా తావరణ శాఖ ప్రకటించింది. విత్తనం వేసినప్పటి నుంచి కోత వరకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహా లు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయి. 

- హబీబ్‌బాషా,  జేడీఏ

Updated Date - 2020-07-11T10:38:15+05:30 IST